ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ వీరబాబు

నల్లగొండ జిల్లా: ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని కొండమల్లేపల్లి ఎస్ఐ వీరబాబు అన్నారు.

బుధవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని సాగర్ ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ పై వెలసిన హోటల్స్,పాన్ షాప్ మరియు ఇతర దుకాణాలను పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమకు సహకరించాలని తెలిపారు.పట్టణంలో త్రిబుల్ డ్రైవింగ్,రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఏఈ సతీష్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చైతన్య శోభిత విషయంలో వేణు స్వామికి బిగ్ షాక్.. చర్యలు తప్పవా?
Advertisement

Latest Nalgonda News