తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి అగ్ర హీరో శోభన్ బాబు( Shobhan Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు శోభన్ బాబు.
అంతేకాకుండా అప్పట్లోనే శోభన్ బాబు బీభత్సమైన లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.మరీ ముఖ్యంగా కుటుంబం కథా చిత్రాలు అన్న ఇద్దరు భార్యలు ఉండే సినిమాలు అన్న ముందుగా గుర్తుకు వచ్చేది శోభన్ బాబు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
సినిమాలలో తన హీరోయిజంతో,అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేవారు.
ఎప్పుడు తాను నవ్వుతూ చుట్టూ ఉన్న వారిని కూడా నవ్విస్తూ ఉండేవారు శోభన్ బాబు.నాకు కోపం చాలా అరుదుగా వచ్చేది.కోపం వచ్చింది అంటే అవతల వాళ్ళ పని అయిపోయినట్టే అని చెప్పవచ్చు.
అలా ఒకసారి ఒక హీరోయిన్ విషయంలో కోపంతో రగిలిపోయిన శోభన్ బాబు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారట.ఆ హీరోయిన్ మరెవరో కాదు హీరోయిన్ నగ్మా( Nagma ).అప్పట్లో నగ్మా కూడా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.కాగా శోభన్ బాబుతో కలిసి అడవి దొర ( Adavi Dora movie )అనే సినిమాలో నటించింది నగ్మా.
ఇందులో సెకండ్ హీరోయిన్ గా సురభి( Surabhi ) నటించింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో బృందం అందరూ ఒక సాంగ్ చిత్రీకరణ కోసం చైనా సరిహద్దు కు వెళ్లారు.అందరూ వచ్చినా కూడా హీరోయిన్ నగ్మా ఇంకా అప్పటికి రాలేదు.నగ్మా కోసం హీరో శోభన్ బాబు చాలా సేపు వెయిట్ చేశారట.దాదాపు గంటన్నర ఆలస్యంగా షూటింగ్ స్పాట్ కి రావడమే కాకుండా తలతిక్క సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా శోభన్ బాబు ఆమెపై విరుచుకుపడ్డారట.అప్పుడు ఆమెను పిలిచి మీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది అని అడగగా దానికి నగ్మ సమాధానం ఇవ్వడంతో నా బాత్రూం విలువ చేయదు నీ ఆస్తి, బిహేవ్ ప్రాపర్లీ టైం సెన్స్ ఉండాలి అని విరుచుకుపడ్డారట.
అప్పుడు మోహన్ బాబు సీరియస్ అవ్వగా నగ్మా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉందట.ఆ తర్వాత మోహన్ బాబు బ్యాగ్రౌండ్ తెలిసి తన తప్పు తాను తెలుసుకుని పచ్చతాపపడిందట.