టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి. అల్లు అర్జున్ మంచి హోదాలో ఉన్న సమయంలో నల్లగొండ జిల్లాకు చెందిన స్నేహను పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.పెళ్లి తర్వాత కూడా తన భార్య సపోర్ట్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు అల్లు అర్జున్.
ఒకవైపు సినిమాలు చూసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటున్నాడు.ఇక తన భార్య స్నేహారెడ్డిని పలు వేదికల ద్వారా అందరికి పరిచయం చేశాడు.
ఇక ఆమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో సొంతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.నిత్యం అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
తన పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది.ఇక స్నేహ ఏ స్టార్ హీరోయిన్ సొంతం చేసుకొని క్రేజ్ ను సోషల్ మీడియా ద్వారా సంపాదించుకుంది.
అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.
ఫ్రెండ్స్ తో వెళ్లిన ట్రిప్స్ ఫోటోలను, సందడి చేసిన వీడియోలను పంచుకొని అందరి దృష్టిలో పడుతుంది.
ఈ మధ్య స్నేహ అందం విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు.మంచి ఫిజిక్ కోసం బాగా వర్క్ అవుట్ లు చేస్తుంది.
అంతేకాకుండా పలు మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని ఫోటో షూట్ లు చేయించుకుంటూ ఆ ఫోటోలను వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తుంది.
తరచుగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ సోషల్ మీడియాలలో పెట్టడంతో ఈమె సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉందేమో అని అందరూ అనుకున్నారు.కానీ అదంతా ఫేక్ అని తెలిసింది.కానీ బన్నీ అభిమానులు ఈమెను హీరోయిన్ గా చూడాలి అని బాగా కలలు కంటున్నారు.
కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం ఆమె నటిగా అడుగుపెట్టదని క్లారిటీ ఇచ్చేసింది.
ఇక హీరోయిన్ గా అడుగుపెట్టకుండా కూడా ఆమె గ్లామర్ షో చేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.కానీ తన కూతురు అల్లు అర్హ మాత్రం ఇండస్ట్రీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.సమంత నటించిన శాకుంతలం సినిమాలో అర్హ ఒక పాత్రలో నటించింది.
ఇక త్వరలో ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఇదంతా పక్కనే పెడితే తాజాగా స్నేహ రెడ్డి ఒక స్టోరీ పంచుకుంది.అదేంటంటే అందులో తన భర్త అల్లు అర్జున్ ని హగ్ చేసుకుని ఆయనను ట్యాగ్ చేస్తూ మిస్ యు అని పంచుకుంది.దీంతో ఆ ఫోటో బాగా వైరల్ అవ్వగా ఆ ఫోటోని చూసిన అల్లు అర్జున్ అభిమానులు.
బన్నీ అన్న ఎక్కడికి వెళ్తున్నాడు.ఎందుకు మిస్ అవుతున్నావు వదిన అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరికొంతమంది పుష్ప టు షూటింగ్ కోసం దూరంగా వెళ్లిపోతున్నాడేమో అని అనుకుంటున్నారు.