సితార( Sitara Ghattamaneni ).ఘట్టమనేని పరిచయం అవసరం లేని పేరు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నమ్రత ల ( Namrata Shirodkar )కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే సితార చిన్న వయసు అయినప్పటికీ ఈమె మాత్రం హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారనే చెప్పాలి.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సితార ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.
ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన డాన్స్ వీడియోలతో పాటు తనకు సంబంధించిన అన్ని వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు.ఇక కేవలం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్( Instagram ) లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఈమె హీరోయిన్లతో పాటు ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు.ఇక తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలతో పాటు సితార తన తండ్రి సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇక ఈమెను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్( Sitara Instagram ) లో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీగానే ఉందని చెప్పాలి.ఇలా ఇంత చిన్న వయసులోని ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అంటే ఇక హీరోయిన్ అయిన తర్వాత స్టార్ అవడంలో ఇలాంటి సందేహం లేదని చెప్పాలి.
ఇక సితార కూడా అతి త్వరలోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చెప్పాలి.
ఇది ఇలా ఉండగా సితార తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తన నెల సంపాదన గురించి ఒక వార్త వైరల్ గా మారింది.సితార ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు సుమారుగా 30 లక్షల వరకు ఆదాయం( Sitara Remuneration ) అందుకుంటున్నారంటూ ఈ వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఇంత చిన్న వయసులోనే ఇంస్టాగ్రామ్ ద్వారా ఆ రేంజ్ లో ఆదాయం రాబడుతున్నారు అంటే సితార మామూలు అమ్మాయి కాదు అంటు కామెంట్స్ చేస్తున్నారు.