భయపెడుతున్న సిట్ అమరావతిలో టెన్షన్ టెన్షన్

ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు మరింత వేడెక్కుతోంది.అమరావతి విషయంలో ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

 Sit Officialinvestigation Tdp Leaders In Amaravathi-TeluguStop.com

ఇప్పుడిప్పుడే ఈ వ్యవహారం సర్దుమణుగుతూ వస్తున్నట్టుగా కనిపిస్తోంది.తాజాగా ఏపీలో కొత్తగా ఏర్పడిన సిట్ ప్రత్యేక బృందం ఇప్పుడు అమరావతిలో తనిఖీలు నిర్వహిస్తూ కొంతమంది టిడిపి నాయకులే లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తోంది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో నెలకొన్న అవినీతిపై సమగ్రంగా విచారణ చేయించేందుకు కొద్దిరోజుల క్రితమే ఐపీఎస్ అధికారి కొల్లి రఘురాం రెడ్డి నేతృత్వంలో ఫిఫ్త్ ప్రత్యేక బృందాన్ని ఏపీ సీఎం జగన్ నియమించారు ఇక అప్పటి నుంచి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన సిట్ బృందం అమరావతి భూమి వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది.

Telugu Pathipatipulla, Sit Latest, Sitofficial, Tdp-Political

ఈ నేపథ్యంలోనే టిడిపి కీలక నాయకులు కొంతమంది ఇళ్లపైన, వారి బంధువుల ఇళ్లపైనా దాడులు చేసి అనేక కీలక ఆధారాలు సంపాదించినట్లు తెలుస్తోంది.కంచికచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీనారాయణ ఇంటిపై నిన్న దాడులు నిర్వహించిన అధికారులు పూర్తిస్థాయిలో ఆయన ఇంట్లో సోదాలు చేసినట్లు తెలుస్తోంది.అలాగే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వియ్యంకుడు ఇంట్లోనూ సిట్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది.

అలాగే అమరావతి ప్రాంతంలోని ఒక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా పూర్తిస్థాయిలో విచారించినట్లు తెలుస్తోంది.వారే కాకుండా ఇంకా అనేకమంది టిడిపి నాయకులు వారి అనుచరులు, బంధువులు లక్ష్యంగా ఇప్పుడు సిట్ రంగంలోకి దిగి దర్యాప్తు మొదలు పెట్టడంతో టిడిపి నాయకుల్లో ఆందోళన మొదలైంది.

Telugu Pathipatipulla, Sit Latest, Sitofficial, Tdp-Political

ఇప్పటికే అమరావతిలో బినామీ పేర్ల పై భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఏపి సిఐడి బృందం విచారించింది.ఈ సందర్భంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, నారాయణ పై కేసు నమోదు కూడా చేశారు.అలాగే దీనిపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది.సిఐడి దర్యాప్తు చేసిన ఆధారాలను సిట్ అధికారులు తెప్పించుకొని దానిపైన సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొద్దిరోజుల క్రితమే సిఐడి అధికారులు 757 తెల్ల రేషన్ కార్డుదారులు అమరావతి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు కొన్నారని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారని సిఐడి ఇప్పటికే నిర్ధారించింది.ప్రస్తుతం అధికారులు అన్ని విషయాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఎప్పుడు ఎవరి ఇంటి పై అధికారులు దాడులు నిర్వహిస్తారో తెలియక టిడిపి నాయకులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube