యూట్యూబ్‌లో భారత సంతతి యువతి సంచలనం

వ్యక్తిలో దాగున్న ప్రతిభను వెలికితీసి దానిని నలుగురికి పరిచయం చేసేందుకు యూట్యూబ్ ప్రస్తుతం వారధిలో ఉపయోగపడుతోంది.

షార్ట్‌ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, పాటలు ఇలా ఎందరో ఔత్సాహికులు తమలో దాగున్న టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసి జీవితంలో స్థిరపడ్డారు.

అలా దుబాయ్‌లో స్ధిరపడిన భారతీయ సంతతి యువతి పాటలు కంపోజ్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.వాటికి మిలియన్ వ్యూస్ దక్కాయి.

15 ఏళ్ల షిరేన్ సంజయ్‌ ఆరు నెలల క్రితం యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన మొదటి ఒరిజినల్ సాంగ్ ‘‘చల్తే చల్తే’’కు పది లక్షల వీక్షణలు వచ్చాయని గల్ఫ్ న్యూస్ శుక్రవారం ఒక కథనంలో తెలిపింది.పేరు లేకుండా నవంబర్ 5, 2017న ప్రారంభమైన ఈ ఛానెల్‌కు ఇప్పటి వరకు మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి.దుబాయ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న షిరేన్ ఇంగ్లీష్, హిందీ, పంజాబీ భాషలలో పాడింది.

ఇప్పుడు తనకు సంగీతమే జీవితం అయిందని షిరేన్ చెప్పారు.ఆమె మొట్టమొదటి ప్రదర్శన దుబాయ్‌లోని జెబెల్ అలీలోని గురునానక్ దర్బార్ గురుద్వారాలో జరిగింది.అక్కడ ఆమె గాత్రం విన్న ప్రేక్షకులు, సంగీతప్రియులు షిరేన్‌ను ప్రశంసలు అందుకున్నారు.

Advertisement

దీనిపై షిరేన్‌ స్పందిస్తూ ఈ విజయం వెనుక తన కుటుంబం, ముఖ్యంగా అమ్మమ్మ తనను సంగీతంలో శిక్షణ తీసుకోవడానికి ప్రేరేపించిందని ఆమె వెల్లడించారు.తాను ప్లేబ్యాక్ సింగర్‌గా మారాలనుకుంటున్నానని షిరేన్ చెప్పింది.

బెయోన్స్, ఏఆర్ రహమాన్ తన గానాన్ని మెచ్చుకున్నారని ఆమె ఉద్వేగంగా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు