సినిమా ఇండస్ట్రీలో సహాయం చేసినా చెప్పుకోవడానికి ఇష్టపడని హీరోలు, దర్శకులు వీళ్లే!

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు, దర్శకుల పారితోషికాలు భారీ రేంజ్ లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల రేంజ్ లో సైతం పారితోషికం తీసుకునే హీరోలు ఎక్కువమంది ఉన్నారు.

 Shocking Facts About Tollywood Industry Star Celebrities Chiranjeevi Balayya Paw-TeluguStop.com

అయితే ఈ హీరోలలో దాన గుణం ఉన్న హీరోలు, దర్శకులు చాలామంది ఉన్నారు.అయితే చాలామంది సెలబ్రిటీలు ఈ విషయాల గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు.

ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో ముందుండే హీరో చిరంజీవి( Chiranjeevi ) అనే చెప్పాలి.ప్రతిరోజూ ఆయన చేసే సాయం లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది.ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా చిరంజీవి తట్టుకోలేరట.మరో స్టార్ హీరో బాలకృష్ణ( Balakrishna ) బసవతారకం ఆస్పత్రి ద్వారా ఎంతోమందికి ఉచితంగా చికిత్స అందించారు.

పేద ప్రజలకు ఈ ఆస్పత్రి ద్వారా తక్కువ ఖర్చుతో బాలయ్య వైద్యం అందేలా చేసిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.

హిందూపురం ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా బాలయ్య తట్టుకోలేరు.బాలయ్య మంచి మనస్సు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసే విషయంలో పవన్,( Pawan Kalyan ) ప్రభాస్( Prabhas ) ముందువరసలో ఉంటారు.

ఈ హీరోలు తమ రెమ్యునరేషన్ లో ఎక్కువ మొత్తాన్ని తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఖర్చు చేస్తారట.రాజమౌళి,( Rajamouli ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సైతం ఎంతోమందికి తమ వంతు సహాయం చేసినా ఆ విషయాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు.

మహేష్ బాబు( Mahesh Babu ) తన మంచి మనస్సుతో ఇప్పటికే ఎంతోమంది చిన్నారుల ప్రాణాలను నిలబెట్టారు.

అయితే ఈ విషయాలను ప్రచారం చేసుకోవడం మహేష్ కు ఇష్టం ఉండదట.చరణ్,( Ram Charan ) బన్నీ( Allu Arjun ) సైతం ఎవరైనా ఆపదలో ఉంటే ఎంత మొత్తం ఖర్చు చేయడానికి అయినా వెనుకాడరట.కామెడీ సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు సైతం కష్టాల్లో ఉన్నవాళ్లకు తన వంతు సహాయం చేస్తుంటారు.

బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్, బేబీ నిర్మాత ఎస్కేఎన్ సైతం ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమ వంతు సహాయం అందిస్తుంటారు.కోలీవుడ్ ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకునే విషయంలో రాఘవ లారెన్స్ ముందువరసలో ఉంటారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ కు సైతం సేవాగుణం ఎక్కువగా ఉంది.

Facts about Tollywood industry Celebrities

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube