భారతీయ విద్యార్థులకు షాక్... ఆస్ట్రేలియన్ వర్సిటీలలో నిషేధం!

అవును, మీరు విన్నది నిజమే.వీసా దరఖాస్తుల మోసాలకు సంబంధించి కేసులు బయటపడడంతో భారతదేశానికి చెందిన కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులను ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు నిషేధిస్తున్నాయి.

 Shock For Indian Students... Ban In Australian Universities Shocking News, India-TeluguStop.com

ఆ రాష్ట్రాల పేరుని ఉటంకిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేయడం బాధాకరం.అందులో పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్‌తోపాటు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీరు( Jammu Kashmir ) వంటి ప్రాంతాలు వున్నాయి.

అక్కడినుండి వచ్చే విద్యార్థులను ఇక నియమించే వీలులేదని ఆదేశిస్తూ విద్యా ఏజెంట్లను విక్టోరియాలోని ది ఫెడరేషన్ యూనివర్సిటీ మరియు న్యూ సౌత్ వేల్స్‌లోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు( Western Sydney ) లేఖలు రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ విషయాన్ని ‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ పత్రిక తన మెయిన్ హెడ్డింగులో వేసి మరీ ప్రకటించడం గమనార్హం.ప్రస్తుతం ఆస్ట్రేలియా( Australia ) పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉభయ దేశాలకు ( Narendra Modi )చెందిన విద్యార్థుల మధ్య బంధం మరింత బలపడాలని పిలుపునిచ్చిన తరుణంలోనే ఈ పరిణామం తలెత్తడం చాలా దురదృష్టకరం అని నిపుణులు అంటున్నారు.

ఇకపోతే మోడీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులు, పరిశోధకులు, వ్యాపారుల మధ్య మార్పిడిని ప్రోత్సహించేందుకు ఉభయ దేశాల మధ్య మైగ్రేషన్, మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయడం కూడా జరిగాయి.కాగా గత నెలలోనే విక్టోరియా యూనివర్సిటీ, టోరెన్స్ యూనివర్సిటీ, ఎడిత్ గోవన్ యూనివర్సిటీ, సదరన్ క్రాస్ యూనివర్సిటీతోసహా అనేక ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు భారత్‌లోని కొన్ని రాష్ట్రాల విద్యార్థులపై నిషేధం విధించిన విషయం మరువక ముందే ఈ విషయం జరగడం ఒకింత బాధాకరమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube