నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.మనుబోలు మండలం బద్దెవోలులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.







