సర్కారు వారి పాటకు అది ప్రాణం కానుంది!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలుపెట్టుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్ తరువాత ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Screenplay To Be Highlight In Sarkaru Vaari Paata-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తాడు.కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ వల్ల ఆలస్యం అవుతోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మహేష్ తన సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.కాగా ఈ సినిమా కథ ఆర్ధిక నేరాల చుట్టూ తిరగనుందనే విషయం చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలసిందే.

అయితే ఈ సినిమాకు అదిరిపోయే స్క్రీన్ ప్లే ఉండనున్నట్లు తెలుస్తోంది.హీరో విలన్‌ల మధ్య సాగే మైండ్ గేమ్‌ను అద్భుతంగా చూపించడంలో ఈ సినిమా స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకోనుందట.

వారికి ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చిత్ర యూనిట్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండగా, అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.

మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.కరోనా వైరస్ ప్రభావం తగ్గగానే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube