సర్కారు వారి పాటకు అది ప్రాణం కానుంది!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలుపెట్టుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్ తరువాత ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తాడు.కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ వల్ల ఆలస్యం అవుతోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మహేష్ తన సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమా కథ ఆర్ధిక నేరాల చుట్టూ తిరగనుందనే విషయం చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలసిందే.

అయితే ఈ సినిమాకు అదిరిపోయే స్క్రీన్ ప్లే ఉండనున్నట్లు తెలుస్తోంది.హీరో విలన్‌ల మధ్య సాగే మైండ్ గేమ్‌ను అద్భుతంగా చూపించడంలో ఈ సినిమా స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకోనుందట.

వారికి ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చిత్ర యూనిట్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండగా, అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.

మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

కరోనా వైరస్ ప్రభావం తగ్గగానే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?