సహస్త్ర కోసం సుడిగాలి సుధీర్ బాగానే తీసుకున్నాడంట....

తెలుగులో ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్ మరియు హీరో సుడిగాలి సుధీర్ “కాలింగ్ సహస్ర” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రానికి నూతన దర్శకుడు అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఓ నూతన సినీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.

 Sudigali Sudheer, Tollywood Hero And Comedian, Calling Sahastra Movie News, Six-TeluguStop.com

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలో నటించడం కోసం హీరో సుడిగాలి సుధీర్ ఎక్కువ మొత్తంలోనే పారితోషకం పుచ్చుకున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

అంతేగాక ఈ చిత్రంలో సుడిగాలి సుదీర్ సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను అలరించనున్నాడని అందువల్లే ఇప్పటికే సుడిగాలి సుధీర్ ఈ లాక్ డౌన్ సమయంలో ప్రత్యేకంగా ఫిట్ నెస్ ట్రైనర్ ని కూడా నియమించుకున్నాడని ఇటీవలే యాంకర్ రష్మి గౌతమ్ తెలిపింది.మరోవైపు ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్ కి జోడిగా టాలీవుడ్ బ్యూటిఫుల్ రష్మి గౌతమ్ నటిస్తున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయం పై రష్మీ గౌతమ్ మాత్రం ఇప్పటి వరకూ స్పందించ  లేదు.

అయితే ఈ విషయం ఎఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు మొదలు కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా కొంత కాలం పాటు వాయిదా వేశారు.

అయితే ఇటీవలే హీరో సుడిగాలి సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఉండబోతున్నట్లు సమాచారం.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube