అతడికి కరోనా రావడంతో హోం క్వారంటైన్ లో కవిత ఫ్యామిలీ ?

కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణలో మరింత తీవ్రం అయిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సామాజిక వ్యాప్తి మొదలైందని, అప్రమత్తంగా లేకపోతే ప్రతి ఒక్కరూ ఈ వైరస్ మహమ్మారి బారిన పడే అవకాశం ఉంది అంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే ప్రజలను హెచ్చరించారు.దేశవ్యాప్తంగా చూసుకుంటే కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో ఎక్కువగా నమోదవుతున్నాయి.

 Corona Positive To Kcr Daughter Kavitha Driver, Kavitha, Car Driver, Coronavirus-TeluguStop.com

దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవిత హోం క్వారంటైన్ లోకి వెళ్లడం, కవిత గన్ మెన్ కు పాజిటివ్ రావడంతో ఇప్పుడు కలకలం రేగడంతో పాటు కవిత తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటీవల హరితహారంతో పాటు, అనేక కార్యక్రమాల్లో కవిత హాజరవుతూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమె డ్రైవర్ కూడా ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలియగానే కవిత కుటుంబం మొత్తం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే వైరస్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం నమూనాలను పంపారు.దీని ఫలితాలు వచ్చేవరకు టెన్షన్ గానే వారి పరిస్థితి ఉంటుంది.ఇప్పటి వరకు, కవిత కుటుంబ సబ్యులకు వైరస్ లక్షణాలు ఏమీ లేకపోవడంతో, కవిత కుటుంబానికి కాస్త ఊరట ఇచ్చే అంశమే అయినా, ఈ వైరస్ ఎటువంటి లక్షణాలు లేకుండానే సోకుతున్న తీరుపైన ప్రస్తుతం కవిత కుటుంబం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు.కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కూడా ఈ వైరస్ ప్రభావానికి గురయ్యారనే ప్రచారం జరిగినా, అది వాస్తవం కాదని ఆ తరువాత తేలింది.

Telugu Car, Coronavirus, Kavitha, Trs-Telugu Political News

ఇక ఇప్పుడు కవిత డ్రైవర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో కెసిఆర్ ఫ్యామిలీ లోనూ కాస్త టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది.ఒకపక్క కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి.అలాగే వైరస్ బారిన పడిన వారికి చికిత్స చేయించే విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుందనే ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.ఇప్పుడు కవిత డ్రైవర్ కు కూడా పాజిటివ్ లక్షణాలు రావడంతో, కవిత కుటుంబ సభ్యులు చేయించుకున్న వైరస్ నిర్ధారణ పరీక్షల ఫలితం వచ్చేవరకు టెన్షన్ తప్పేలా కనిపించడంలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube