గాలిలో కరోనా కెపాసిటీ ఎంత.. మనిషిని టచ్ చేస్తుందా: భారతీయ శాస్త్రవేత్త అధ్యయనం..!!

గాలిలో చిన్న కణాల ద్వారా కరోనావైరస్ వ్యాపిస్తుందనడానికి ఆధారాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన సంగతి తెలిసిందే.కిక్కిరిసిన ప్రాంతాల్లో, లేదా తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందనే విషయాన్ని కొట్టిపారేయలేం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే ప్రకటించింది.

 Covid-19: Scientists Develop New Method To Estimate Risk Of Airborne Spread  Cor-TeluguStop.com

మూసి ఉన్న ప్రదేశాలు, గదులలో కోవిడ్ రోగి నుంచి ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉన్నా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటివ్ సైతం స్పష్టం చేసింది.తాజా పరిణామాలతో వ్యాపార సంస్థలు, పాఠశాలల పునఃప్రారంభానికి కొత్త సవాల్ ఎదురవుతోంది.

ఈ నేపథ్యంలో అసలు గాలిలో వైరస్ బలమెంత.? ఎంత దూరంలో వున్న వారిని అది టచ్ చేస్తుంది అనే దానిపై అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త రజత్ మిట్టల్ బృందం పరిశోధనలు నిర్వహించింది.దీనిలో భాగంగా కొత్త మ్యాథమెటికల్ మోడల్‌ను అనుసరించి గాలిలో వైరస్ ప్రసారాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేశారు.ఇదే సమయంలో గాలిలో వైరస్ ప్రసరించినప్పటికీ, భౌతిక దూరం ఎక్కువగా ఉంటే, కరోనా ముప్పు తగ్గుతుందనే విషయాన్ని మరోసారి టెక్నికల్‌గా గుర్తించారు.

అలాగే నిపుణులు చెబుతున్నట్లుగా ఎన్ 95, సర్జికల్ మాస్క్‌లతో పాటు గుడ్డతో చేసిన మాస్క్‌లు సైతం వైరస్‌ను అడ్డుకోగలదని నిర్థారించారు.ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలు ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్‌లో ప్రచురించారు.

Telugu Airborne Spread, Coronavirus, Gyms Malls, Indian, Rajath-Telugu NRI

అయితే కోవిడ్ బారినపడిన వారిలో శారీరక శ్రమ వల్ల శ్వాస క్రియ రేటు పెరగడం, తద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదాన్ని గుర్తించామని రజత్ చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, జిమ్‌లు, మాల్స్ వంటి ప్రజలు గుంపులుగా కూడుకునే ప్రదేశాలు తిరిగి ప్రారంభిస్తోన్న నేపథ్యంలో వీటిని పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను మిట్టల్ వెల్లడించారు.అయితే జనాభా ఎక్కువగా వుండే ప్రదేశాల్లో మాస్క్‌ల ప్రభావం, వైరస్ ప్రసారం వంటి అంశాలపై మరింత పరిశోధన జరగాల్సి వుందన్నారు.ఫ్లూయిడ్స్ డైనమిక్స్ భావనను అనుసరించి.గాలి ద్వారా వివిధ అంటు వ్యాధులు సంక్రమించే పరిధిని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.కరోనా తరహాలోనే ఫ్లూ, క్షయ, మెజిల్స్ వంటి ఇన్ఫెక్షన్లు ఇదే తరహాలో వ్యాపిస్తాయని రజత్ చెప్పారు.

కాగా బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, ఇటలీ వంటి దేశాల్లో కరోనా రెండో దశ ప్రారంభమైంది.ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ ప్రకటించింది.అటు ఫ్రాన్స్‌లోనూ ఇదే పరిస్ధితి ఎదురైంది.పరిస్థితి చేయి దాటకముందే చర్యలు చేపట్టాలని భావించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యూనుయేల్ మెక్రాన్ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను బుధవారం ప్రకటించారు.

డిసెంబరు 1 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.దేశంలో కరోనా వైరస్ రెండో దశ మొదలైందని పేర్కొన్నారు.తొలి దశ కంటే ముప్పు ఎక్కువగా ఉంటుందని, దీనిని ఊహించలేం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని మెక్రాన్ హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube