అత్త మనసు గెలిచినట్టే 'శైలజ రెడ్డి అల్లుడు' ఆడియన్స్ మనసు గెలిచాడా.? స్టోరీ.. రివ్యూ అండ్ రేటింగ్.!

Movie Title; శైలజ రెడ్డి అల్లుడు


 Sailaja Reddy Alludu Movie Telugu Review-TeluguStop.com

Cast & Crew:


న‌టీన‌టులు: నాగ చైతన్య, అను ఎమాన్యూల్, రమ్య కృష్ణ, మురళి శర్మ తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: మారుతీ
నిర్మాత‌: ఎస్.రాధా కృష్ణ, ప్రసాద్, సురేష్ వంశీ
సంగీతం: గోపి సుందర్

STORY:


డబ్బు ఉందని గర్వపడుతూ మనుషుల్ని లెక్క చేయని మురళి శర్మ కొడుకు చైతు.ఫ్రెండ్ పెళ్లిలో చైతు అనుని కలుస్తాడు.అను బాగా రిచ్ ఇంకా ఈగో ఉన్న అమ్మాయి.

ఆ పెళ్లి సంగీత్ లో చైతు అనుని టీజ్ చేస్తూ ఉంటాడు.మొదట్లో చైతు మీద అను కోపంతో ఉంటుంది.

కానీ తర్వాత ఆ కోపమే ప్రేమగా మారుతుంది.తన ఇంటికి వచ్చి మాట్లాడమని చైతుకి అను చెప్పే సీన్ తో ఇంటర్వెల్ బాంగ్.

అను వాళ్ళ అమ్మ “శైలజ రెడ్డి”(రమ్య కృష్ణ).ఆ తల్లి కూతుర్లకు ఒక్క క్షణం కూడా పడదు.

ఇద్దరు మాట్లాడుకోరు.వాళ్ళ ఇద్దర్ని కలపాలి అనుకుంటాడు చైతు.

వెన్నెల కిషోర్ తో కలిసి శైలజ రెడ్డి ఇంటికి వెళ్తాడు చైతు.అక్కడ అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు…చివరికి తల్లి కూతుర్లను ఎలా కలిపాడు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.!

REVIEW:



తెలుగులో ఇప్పటి వరకు అత్త, అల్లుడు కాంబినేషన్‌లో చాలా సినిమాలే వచ్చాయి.వాటిలో కొన్ని సూపర్ డూపర్ హిట్లయ్యాయి.మరికొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.అయినప్పటికీ ఈ ఫార్ములాతో సినిమాలు వస్తూనే ఉన్నాయి.వాటిలో తాజాగా ‘శైలజారెడ్డి అల్లుడు’ ఒకటి.ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించడం.

రమ్యకృష్ణ, నాగచైతన్య అత్తాఅల్లుడులుగా నటించడంతో అంచనాలు పెరిగిపోయాయి.ఈ సినిమా చూసినవారు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

కొంత మంది సినిమా బాగుందని ట్వీట్లు చేస్తున్నారు.మరికొంత మంది కొత్తదనం ఏమీ లేదు.

రొటీన్ అంటున్నారు.దర్శకుడిగా మారుతి పూర్తిగా విఫలమయ్యాడని పెదవి విరుస్తున్నారు.

‘అను ఖాతాలో ఇంకోటి చేరిపోయిందంటగా.’ అంటూ ఎగతాళి చేస్తున్నారు.

Plus points:


నాగ చైతన్య, రమ్య కృష్ణ పెర్ఫార్మన్స్
వెన్నెల కిషోర్ కామెడీ
మారుతీ డైరెక్షన్
మురళి శర్మ రోల్
అను ఎమాన్యూల్ గ్లామర్
సాంగ్స్

Minus points:


రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే
కామెడీ అయితే ఉంది కానీ అంతగా నవ్వించలేదు

Final Verdict:


రొటీన్ కమర్షియల్ కామెడీ “శైలజ రెడ్డి అల్లుడు”

Rating: 2.5 / 5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube