సాగర్ ఎడమ కాలువకు పొంచి మరో గండి గండం...!

నల్లగొండ జిల్లా:నిండుకుండలా ప్రవహిస్తున్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ కట్ట ఎన్ఎస్పి అధికారుల పర్యవేక్షణ లోపంతో కంప చెట్లతో కోతకు గురై ప్రమాద భరితంగా మారింది.వివరాల్లోకి వెళితే నలగొండ జిల్లాలో పలుచోట్ల సాగర్ ఎడమ కాలువ కట్ట కోతకు గురై బలహీనంగా మారింది.

2014 లోనే కోట్లు వెచ్చించి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టినా ఇప్పటికీ చాలా చోట్ల కట్ట అద్వాన్నంగా తయారై పనుల్లో నాణ్యత లోపం కారణంగా కొన్ని నెలల్లోనే చాలాచోట్ల సీసీ లైనింగ్ దెబ్బతిన్నది.కట్టల వెంట మట్టి సైతం కోతకు గురవుతుండడంతో స్థానిక రైతులు నుంచి ఆందోళన వ్యక్తం అవుతున్నది.

Sagar's Left Canal Is Another Gandi Gandam , Nagarjunasagar , Gandi Gandam , Sag

ఇప్పటికే పలుచోట్ల కట్ట తెగి పొలాల్లో ఇసుకమేట వేసి సాగుకు పనికిరాకుండా పోయాయి.సాగర్ ఎడమ కాలువ 68వ కిలోమీటర్ వద్ద కోతకు గురై ప్రమాదకరంగా ఉంది.

వచ్చే వర్షాలకు మరింత పెద్దదిగా మారి గండి పడే అవకాశం ఉందని స్థానిక రైతులు వాపోతున్నారు.గండి పడినట్లయితే పంట పొలాలు దెబ్బ తినడంతో పాటు పక్కనే ఉన్న తడకమల్ల చెరువుకు ప్రమాదం పొంచి ఉన్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

వెంటనే కాలువ కట్టను పరిశీలించి కోతకు గురైన కట్టను మరమ్మత్తులు చేయాలని రైతులు కోరుతున్నారు.

ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం : సీఐ శ్రీను నాయక్
Advertisement

Latest Nalgonda News