ఇండియా( India ) తన ఇంధన అవసరాల నిమిత్తం ఎక్కువగా దిగుమతులపైనే అధారపడుతోన్న సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలో విలువైన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవటం కోసం సరసరమైన ధరలకు రష్యా ( Russia ) నుంచి కొనుగోళ్లు చేపట్టింది.
నాటో దేశాలు ఈ విషయంలో ఉడుక్కున్నప్పటికీ మోడీ ప్రభుత్వం( PM Narendra Modi ) పెడచెవిన పెట్టి రష్యాతో మంచి సత్సంబాలు కొనసాగిస్తోంది.ఈ క్రమంలో భారత్ ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులను భారీగా తగ్గించేసింది.
ఇకపోతే, ఒకప్పుడు భారతదేశం దిగుమతి చేసుకున్న ముడి చమురులో ఎక్కువభాగం అంటే, మూడింట ఒక వంతుకు పైగా ఒపెక్ (ఆర్గనైజషన్ అఫ్ ది పెట్రోలియం ఎక్సపోర్టింగ్ కంట్రీస్) ఉత్పత్తి చేసినదే ఉండేది.ఐతే ఇపుడు ఆ పరిస్థితి లేదు.భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో సరఫరా చేయడం ద్వారా వరుసగా 7వ నెల కూడా రిఫైనరీల్లో పెట్రోలు, డీజిల్‌గా మార్చబడిన ముడి చమురు ఏకైక అతిపెద్ద సరఫరాదారుగా ఇపుడు రష్యా కొనసాగుతుండడం విశేషం.అవును, ప్రస్తుతం భారత్.
రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు ఇరాక్, సౌదీ అరేబియా నుంచి సంయుక్త కొనుగోళ్ల కంటే ఎక్కువగా నిలవడం గమనార్హం.
ఇకపోతే అధిక సరుకు రవాణా ఖర్చుల కారణంగా గతంలో భారతీయ రిఫైనర్‌లు రష్యన్ చమురును చాలా మితంగా కొనుగోలు చేసేవి.వొర్టెక్స అందించిన సమాచారం ప్రకారం భారత్ మార్చి 2022లో రష్యా నుంచి కేవలం 68,600 bpd చమురును మాత్రమే దిగుమతి చేసుకోగా, ఈ సంవత్సరం అయితే రికార్డు స్థాయిలో 1,678,000 bpd దిగుమతి చేసుకుంది.డిసెంబరులో యూరోపియన్ యూనియన్ దిగుమతులను నిషేధించిన తర్వాత దాని ఇంధన ఎగుమతులలో అంతరాన్ని పూడ్చేందుకు రష్యా భారతదేశానికి రికార్డు స్థాయిలో ముడి చమురును విక్రయింస్తుండడం విశేషం.
ఈ విషయంలో నాటో గుర్రుగా ఉన్నప్పటికీ మోడీ దేశాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగిపోతుండడం విశేషం.