మనకి సాధారణంగా ఉదయాన్నే టీ తాగనిదే ఏమి తోచదు.ఇంకా చెప్పాలంటే టీతోనే ఇక్కడ చాలామందికి రోజు మొదలవుతుంది.
ఉదయం పూట మాత్రమే కాకుండా సాయంకాల సమయాల్లో కూడా గొంతులో వేడి వేడి టీ పడాల్సిందే.అందుకే మనదేశంలో ప్రతి గల్లీలోనూ టీ షాప్‌లు కొలువుదీరి ఉంటాయి.
అవన్నీ జనాలతో కళకళలాడుతుంటాయి.ఐతే మనదేశంలోని ఓ ఛాయ్ దుకాణం( chai shop ) పర్యాటక ప్రాంతంగా మారిపోయిందనే విషయాన్ని మీరు ఎపుడైనా గమనించారా? లేదంటే ఎవరన్నా ఆ విషయం గురించి చెప్పారా మీకు.
అదే మన భారతదేశంలోని చిట్ట చివరి టీ షాప్.అవును, ఈ దుకాణానికి వెళ్లినవారు ఖచ్చితంగా ఒక సెల్ఫీ అయినా తీసుకొని వెనక్కిరారు.ఉత్తరాఖండ్‌లోని చమోలి( Chamoli in Uttarakhand ) జిల్లాలో ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ‘మాణా’ ( Mana )అనే గ్రామం ఉంది.ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది.
దేశానికి ఇదే ప్రథమ గ్రామంగా పేరుగాంచింది.భారతదేశంలోని మొదటి గ్రామమైన ‘మాణా’లో ‘హిందూస్థాన్ చివరి టీ దుకాణం’ ఉంది.
దీనిగురించే మనం మాట్లాడుకునేది.
బద్రీనాథ్‌కు( Badrinath ) వచ్చే భక్తులందరూ ఈ టీ షాప్‌లో టీ తాగనిదే నిద్రపోరంటే మీరు నమ్ముతారా? ఈ ప్రదేశం సెల్ఫీ పాయింట్‌గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఇది సముద్ర మట్టానికి 3,118 మీటర్ల ఎత్తులో ఉండడంతో అక్కడికి వెళ్ళినవారు చాలా క్రేజీగా ఫీల్ అవుతారు.సుమారు 25 సంవత్సరాల క్రితం చందర్ సింగ్ బద్వాల్( Chander Singh Badwal ) అనే వ్యక్తి ఇక్కడ టీ షాప్‌ను ప్రారంభించగా ఇది భౌగోళికంగా మన దేశంలో చిట్ట చివరి టీ స్టాల్ గా పేరు గాంచింది.
చైనా సరిహద్దు నుండి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఇది ఉంటుంది.ఇక్కడున్న టీ స్టాల్‌పై ‘భారతదేశంలోని చివరి టీ దుకాణానికి మీకు హృదయపూర్వక స్వాగతం’ అని హిందీతో పాటు భారతదేశంలోని 10 భాషలలో అక్కడ రాయబడివుంటుంది.