గూగుల్ మ్యాప్స్( Google Maps ) గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే, ఇక్కడ గూగుల్ మ్యాప్స్ వాడని వినియోగదారులు ఉండరంటే నమ్మశక్యం కాదు మరి.
గూగుల్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఒక రకమైన సేవలు ఇవి.వీని ద్వారా భౌగోళిక ప్రదేశాలను గుర్తించడం చాలా తేలిక గనుక మనం ఎక్కడికన్నా కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు గూగుల్ మ్యాప్స్ సాయంతో మనం వేలాలనుకున్న ప్రదేశానికి వెళుతూ ఉంటాం.అయితే గూగుల్ మ్యాప్స్ మీద కొన్ని సార్లు గుడ్డిగా ఆధారపడలేము.అలా ఆధారపడి ఒక్కోసారి బుక్కైపోయిన ఘటనలు చాలానే ఉంటాయి.
ప్రస్తుతం, సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే ఇదే విషయం బోధపడుతుంది.అవును, గూగుల్ మ్యాప్స్ ను అనుసరిస్తూ ఓ మహిళ ( Woman ) తన కారుతో ఏకంగా సముద్రంలోకి దూసుకు పోయింది.ఈ సంఘటన హవాయిలోని( Hawaii ) హోనోకోహౌ హార్బర్‌లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.మ్యాప్ ను ఫాలో అవుతూ కారు హార్బర్ లోని సముద్రంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
దాంతో, కారు ఏకంగా సముద్రంలో సగానికి పైగా మునిగిపోయింది.దీంతో కారులో ఉన్న ఇద్దరు మహిళలను రక్షించేందుకు అక్కడే ఉన్న వారు నీటిలోకి హుటాహుటిన దూకారు.దాంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది.ఈ వీడియో రికార్డు చేసిన స్థానిక వ్యక్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ.“ఇది చాలా భయానకమైన దృశ్యం అయినప్పటికీ బాధితుల ముఖంలో అస్సలు భయాందోళనలు కనిపించలేదు.ఎందుకంటే వారికి వెంటనే సహాయసహకారాలు అందాయి” అని చెప్పుకొచ్చాడు.