'ఇండియన్ క్రికెటర్' పదాన్ని తొలిగించిన రోహిత్ శర్మ.. ఏమైంది ఎందుకు ఇలా..?!

ప్రస్తుతం ఐపీఎల్ 13వ సీజన్ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోంది.అయితే ఈ ఐపీఎల్ పర్యటన అయిపోయినాక భారతదేశ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటనకు వెళ్లనుంది.

 Rohit Sharma Removes The Word Indian Cricketer What Happened And Why Indian Cric-TeluguStop.com

అయితే తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.అయితే అనుకోకుండా ఈ లిస్టులో స్టార్ బ్యాట్స్ మెన్ వన్డే, టి20 జట్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు కనిపించకపోవడంతో పెద్ద చర్చ జరుగుతోంది.

అయితే ఇందుకు సంబంధించి బీసీసీఐ అతడికి గాయం కారణంగా విశ్రాంతి అవసరమని అందుకు మెడికల్ సిబ్బంది ఎప్పటికప్పుడు రోహిత్ ను పర్యవేక్షిస్తుందని తెలిపింది.దీంతో ప్రస్తుతం ఐపీఎల్ లో కూడా రోహిత్ శర్మ తరువాతి మ్యాచ్ లలో ఆడతాడా లేదన్న విషయం పై అభిమానులు కాస్త గందరగోళం నెలకొని ఉంది.

ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే తాజాగా రోహిత్ శర్మ తన సోషల్ మీడియా ఖాతాల నుండి ఇండియన్ క్రికెటర్ అనే పదాన్ని తొలగించడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో భారత దేశ క్రికెట్ అభిమానుల్లో లేనిపోని అనుమానాలు మొదలయ్యాయి.

ఓ టీమిండియా స్టార్ ఆటగాడిపై బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపట్ల టీమిండియా అభిమానులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్నరోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన లిస్టు లో రోహిత్ శర్మ కు స్థానం దక్కకపోవడంతో టీమిండియా అభిమానుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే గత 2 మ్యాచ్లకు గాయం కారణంగా దూరమైన యమాంక్ అగర్వాల్ మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించడంతో ఎలక్షన్ కమిటీ పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ కు ఎందుకు స్థానం కల్పించలేదు అంటూ పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయితే తాజాగా రోహిత్ శర్మ తన సోషల్ మీడియాలో ఇండియన్ క్రికెటర్ అనే పదాన్ని తీసివేయడంతో ఫాన్స్ మరింత గందరగోళానికి గురవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube