రామ్ గోపాల్ వర్మ ఒక సక్సెస్ ఫుల్ దర్శకుడు, లెజెండ్రీ పర్సనాల్టీ, పదుల సంఖ్యలో టాప్ దర్శకులను అందించిన గొప్ప టెక్నీషియన్, ఇండియన్ సినిమాకు కొత్త హంగులు అద్దిన టాప్ డైరెక్టర్, ట్రెండ్ సెట్టర్ మరియు వైవిధ్యభరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.అయితే ఇవన్నీ గతం.
కొన్ని సంవత్సరాల క్రితం వర్మకు ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని గొప్ప పదాలు కూడా సరిపోయేవి.కాని ఇప్పుడు మాత్రం కాదు.
ఇప్పుడు వర్మ అంటే ఒక బూతు చిత్రాల దర్శకుడు, ఆయన పబ్లిసిటీ కోసం పిచ్చి పట్టిన వాడిల చెత్త సినిమాలు చేసే దర్శకుడు అంటూ ఆయన అభిమానులు కూడా అనేస్తున్నారు.
ఒకప్పుడు వర్మ వివాదాస్పద చిత్రాలు చేస్తే కొందరు కాకుంటే కొందరు అయినా ఆయన్ను అభిమానించే వారు చూసేవారు.
కాని ఎలాగూ జనాలు చూస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి కదా అని ఇష్టానుసారంగా సినిమాలు తీస్తున్నాడు.దానికి తోడు సినిమా పరువు తీసేలా సినిమా అంటే వ్యాల్యూ పోయేలా వర్మ చేస్తున్నాడు.
దాంతో ఆయన్ను సినిమా ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలా అన్నట్లుగా టాక్ మొదలైంది.పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇంకా పలువురిపై వివాదాస్పద చిత్రాలు చేయడం వంటి కారణంతో వర్మను బహిష్కరించే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.
సినిమా ఇండస్ట్రీ నుండి వర్మను బహిష్కరించినా ఆయన మరింత రెచ్చి పోయే అవకాశం ఉంది.వరుసగా డిజిటల్ చిత్రాలు చేస్తూ మరింతగా టాలీవుడ్ ప్రముఖులను తనను బ్యాన్ చేసిన వారిని టార్గెట్ చేసే అవకాశం ఉంది.
డిజిటల్ చిత్రాలు ప్రస్తుతం వర్మకు మంచి డబ్బు సంపాదించి పెడుతున్నాయి.అందుకే పెద్ద సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి ఆయనే వస్తాడేమో అంటున్నారు.మొత్తానికి వర్మ గురించి ఏదో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది.