భారత్ ఆన్ లాక్ 2.0 తర్వాత కరోనా కేసులు రోజు రోజుకు దారుణంగా పెరిగిపోతున్నాయి.రోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.ఇంత దారుణంగా కరోనా విజృంభించడానికి కారణం ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడమే.
ఎందరో పరిశోధకులు రాత్రి పగులు తేడా లేకుండా వాక్సిన్ కనుగొనేందుకు కష్టపడుతున్నారు.ఇంకా దీనికి సంబంధించి ఈ ఏడాది చివరికి కరోనాకు మందు వస్తుందని ఆక్సవర్డ్ ఇప్పటికే ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
అయితే తాజాగా మరో గుడ్ న్యూస్ తెలిసింది.స్వీడెన్ కంపెనీ ఎంజమైటికా తయారు చేసిన కోల్ద్ జైమ్ మందు కరోనా నియంత్రణలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ మెడిసిన్ గొంతు, నోటిలో ఉండే 98.3 % వైరస్ ను నాశనం చేసిందని ప్రాథమిక పరిశోధనల్లో తేలింది.
ఎంజమైటికా కంపెనీ నిన్న పరిశోధనల ఫలితాలను ప్రకటించింది.ఇంకా ఈ కోల్డ్ జైమ్ హిలార్ లా పని చేస్తుంది.కోల్డ్ జైమ్ ను నోట్లో పిచికారీ చేసుకుంటే కేవలం 20 నిమిషాల్లో వైరస్ ఖతం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.ఇంకా అంతేకాదు ఈ కోల్డ్ జైమ్ వల్ల ఎటువంటి నష్టం ఉండదని అమెరికన్ కంపెనీ మైక్రోబాక్ లేబొరేటరీస్ లో వారి పరిశోధనలలో తెలిసింది.
ఇది మాత్రమే కాదు పలు వ్యాక్సిన్ లు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి.ఈ ఏడాది చివరినాటికి కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఏది ఏమైనా 20 నిమిషాల్లోనే వైరస్ ను ఖతం చేసే మందు రావడం ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.