దొంగ పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించిన రేణు దేశాయ్‌.. ఏమందో తెలుసా?  

Renu Desai Response On Secret Marriage-marriage,movie Updates,renu Desai,second Marriage,secret,social Media

  • పవన్‌ మాజీ సతీమణి రేణు దేశాయ్‌ చాలా ఏళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతూ వస్తోంది. పిల్లలు పెద్ద వారు అయిన నేపథ్యంలో తనకు తోడు కావాలని నిర్ణయించుకున్న రేణుదేశాయ్‌ రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది.

  • దొంగ పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించిన రేణు దేశాయ్‌.. ఏమందో తెలుసా?-Renu Desai Response On Secret Marriage

  • పెళ్లికి సంబంధించిన వివాహ నిశ్చితార్థం అయ్యింది. పెద్ద ఎత్తున వివాహం కూడా జరుగబోతుందని వార్తలు వచ్చాయి.

  • కాని నిశ్చితార్థం జరిగి నెలలు గుడుస్తున్నా కూడా ఇంకా పెళ్లి గురించి ఎలాంటి వార్తలు లేవు. దాంతో వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందని కొందరు, పెళ్లి అయ్యిందని కొందరు ఇష్టం వచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

  • ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు భయపడ్డ రేణు దేశాయ్‌ దొంగతనంగా పెళ్లి చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై తాజాగా రేణు దేశాయ్‌ మీడియాతో మాట్లాడుతూ తాను దొంగ పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేసింది.

  • అసలు తాను దొంగ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటీ అంటూ ప్రశ్నించింది. తాను దొంగ పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలు నవ్వు పుట్టిస్తున్నాయని చెప్పుకొచ్చింది.

  • పెళ్లి అనేది చాలా పెద్ద విషయం. దాని విషయంలో హడావుడి ఎందుకు అంటూ ప్రశ్నించింది.

  • Renu Desai Response On Secret Marriage-Marriage Movie Updates Renu Second Marriage Secret Social Media

    నేను ఎప్పుడు కూడా పెళ్లి విషయంలో హడావుడిగా ఉండను అని, హడావుడి నిర్ణయాలు తీసుకోను అంటూ చెప్పుకొచ్చింది. తాను వివాహం చేసుకోబోతున్న విషయంను అందరికి తెలియజేస్తాను, దొంగతనంగా పెళ్లి చేసుకోను, అన్ని విషయాలు కాకున్నా పెళ్లికి సంబంధించిన తేదీ మరియు కొన్ని విషయాలు అయినా నేను చెప్తాను, సోషల్‌ మీడియాలో నా పెళ్లి గురించి అప్‌ డేట్‌ ఇస్తాను, దొంగతనంగా పెళ్లి చేసుకోను అంటూ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే పెళ్లి వార్త చెబుతానంటూ రేణు దేశాయ్‌ పేర్కొంది.