ఎనిమిది ఏళ్ళ తరువాత చిరుకు ఊరట

మెగా స్టార్, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవికి 8 ఏళ్ళ తరువాత ఊరట లభించింది.దేనిలో ఊరట? కోర్టు కేసులో.చిరు మీద అంత పెద్ద కేసు ఉందా? పెద్ద కేసు కాదు చాలా చిన్నది.కోర్టు భాషలో పెట్టీ కేసు అంటారు.

 Relief For Chiranjeevi-TeluguStop.com

చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ మాదిరిగా చిన్న కేసులే పెద్ద వారిని చికాకు పెడుతుంటాయి.ఇది కూడా జోరీగ మాదిరిగా చిరును చికాకు పెట్టింది.

చివరకు బుధవారం కోర్టు కొట్టేసింది.ఈ కేసు ఎప్పటిది ? 2008 సంవత్సరం నాటిది.అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం అధినేత.అప్పట్లో ఆయన ఎపీలోని నంద్యాల పట్టణంలో రోడ్ షో చేసారు.దాని వాళ్ళ ట్రాఫిక్ కు అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారని అక్కడి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది.ఇందుకు చిరంజీవి కారణమని నిందితుడిగా బుక్ చేసారు.

ఆ విచారణ ఇన్నేళ్ళు జరిగింది.ఈ కేసు కొట్టేయాలని, ఆధారాలు ఏమీ లేవని చిరు కోర్టుకు విన్నవించాడు.

చివరకు చిరంజీవి వాదనను పరిగణనలోకి తీసుకున్న హై కోర్టు కేసు కొట్టేసి ఆయనకు ఊరట కలిగించింది.ఈ కేసు పెట్టినప్పుడు పీ ఆర్ పీ అధినేతగా ఉన్న చిరంజీవి ఆ తరువాత కాంగ్రేసులో తన పార్టీని విలీనం చేయడం, కేంద్రంలో మంత్రి కావడం, ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం, ఈ పని జరిగి దాదాపు ఏడాదిన్నర గడిచిపోవడం….

ఇలా ఎన్నో పరిణామాలు జరిగాయి.ఇప్పుడు ఈ పెట్టీ కేసు కొట్టేసారు.

ఇదీ మన దేశం….।

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube