టీడీపీలోకి వై కా పా ఎమ్మెల్యే....?

ఎపీలోని కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.ఈయన ఎవరనేది పేరు బయటకు రాలేదు.

గత ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో వై కా పా 9 సీట్లు గెలుచుకుంది.జగన్ సొంత జిల్లా అయిన కడపలో బలంగా ఉన్న పార్టీకి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఝలక్ ఇవ్వబోతున్నారు.

ఇతను చాలా సీనియర్ ఎమ్మెల్యే అని, వై ఎస్ రాజశేఖర రెడ్డికి చాలా విధేయుడని తెలుస్తున్నది.ఇతను టీడీపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నాడని, సమయం చూసుకొని టీడీపీ లోకి జంప్ అవుతాడని కొందరు నాయకులు చెబుతున్నారు.

తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను గులాబి పార్టీ గుంజుకుంటూ ఉండగా, ఏపీలో వై కా పా ప్రజాప్రతినిధులను టీడీపీ లాక్కుంటూ ఉంది.కేసీఆర్కు టీడీపీని నిర్వీర్యం చేయడం లక్ష్యం కాగా, చంద్రబాబుకు వై కా పాను దెబ్బ తీయడం ప్రధానం.

Advertisement

అయితే తెలంగాణలో టీడీపీ కంటే ఏపీలో వై కా పా బలమైన ప్రతి పక్షంగా ఉంది.కాబట్టి పూర్తిగా తుడిచి పెట్టడం సాధ్యం కాదు.

జగన్ ధోరణితో విసిగి పోయిన వారు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు.దీన్ని జగన్ గమనించాలి.

Advertisement

తాజా వార్తలు