Tollywood Heroines: తొందరపాటు వల్ల తమ కెరీర్ ను పాడు చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే.. ఇప్పుడు బాగా తిప్పలు పడుతున్నారుగా?

కొంతమంది హీరోయిన్లు మంచి హోదాకు ఇట్టే వస్తున్న సమయంలో కొన్ని కండిషన్స్ పెట్టి ఆ క్రేజ్ ను అక్కడికే ముగింపు పలికించేస్తుంటారు.

అతి తొందర వల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి భవిష్యత్తును వదిలేసుకుంటారు.

చేతులారా చేసుకునే తప్పుల వల్ల ఇప్పుడు అవకాశాలు లేక బాధలను అనుభవిస్తూ ఉంటారు.ఇక ఈ లీస్ట్ కు చెందిన వాళ్లలో ఒక నలుగురు హీరోయిన్స్ ఉన్నారు.

ఇంతకు వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

కృతి శెట్టి:

చిన్న వయసులో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కృతి( Kriti Shetty ) చాలా అడ్వటైజ్మెంట్లలో చేసి ఆ తర్వాత ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది.ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.కానీ అంతే తొందరగా డౌన్ కూడా అయింది.

Advertisement

ఉప్పెన తర్వాత వరుస సినిమాలు చేసినా కూడా అంత క్రేజ్ హిట్ అందుకోలేకపోయింది.దీంతో దర్శకులు కూడా అవకాశాలు ఇవ్వటానికి ముందుకు రావట్లేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాతోనే బిజీగా ఉంది.అయితే సినిమాల విషయంలో తను చేసిన తప్పు ఏంటంటే సినిమాలు ఎంచుకునే విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం.

రాశి ఖన్నా:

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాశి ఖన్నా( Raasi Khanna ) కెరీర్ మొదట్లో మంచి మంచి సినిమాలు చేసినప్పటికీ కూడా స్టార్ హీరోయిన్గా చేరుకోలేకపోయింది.దానికి కారణం ఏంటంటే కెరీర్ మొదటి నుంచి తను తీసుకుని నిర్ణయాలే.తనకు ఎటువంటి కథ ఉన్న సినిమాను ఎంచుకోవాలో తెలియక వచ్చిన సినిమాలకు తొందరపడి సైన్ చేసింది.

దాంతో ఫ్లాప్స్ రావటం అవకాశాలు దూరం అవ్వటం జరగటంతో ప్రస్తుతం అవకాశాల కోసం ఆరాటపడుతుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

సాయి పల్లవి:

టాలీవుడ్ ఇండస్ట్రీలో హైబ్రిడ్ పిల్లగా సాయి పల్లవి( Sai Pallavi ) తెలుగు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో చూసాం.ముఖ్యంగా ఫిదా సినిమాతో ప్రతి ఒక్కరిని తన వైపుకు మలుపుకుంది.ఈ బ్యూటీ చేసే సినిమాలు కూడా మంచి కంటెంట్ తో వస్తుంటాయి.

Advertisement

అయితే ఈ తరం ప్రేక్షకులు సినిమాలలో హీరోయిన్స్ నుంచి బోల్డ్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.కానీ సాయి పల్లవి బోల్డ్ సీన్లలో అసలు నటించదు.దాంతో డైరెక్టర్లకు ఆమెకు తగ్గట్టు కథను ఎంచుకోవటం కష్టం కాబట్టి వేరే హీరోయిన్స్ ని చూసుకుంటూ ఉన్నారు.

ప్రస్తుతం ఆమె ఒక్క సినిమాలో మాత్రమే బిజీగా ఉంది.

పూజ హెగ్డే:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే( Pooja Hegde ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ కు చేరుకోగా ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాలతో నటించి భారీ డిజాస్టర్ తీసుకువచ్చింది.దీంతో ఐరన్ లెగ్ అని ముద్ర వేయడంతో పాటు ఈ బ్యూటీ హీరోలతో, దర్శకులతో అతిగా ప్రవర్తించడం వల్ల అవకాశాలు తగ్గాయని తెలిసింది.

రీసెంట్గా మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చినా కూడా తన అతి ప్రవర్తన వల్ల ఆ సినిమా నుండి డైరెక్టర్ తీసేసాడని తెలిసింది.

తాజా వార్తలు