గత కొద్ది రోజులుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh ) సైలెంట్ అయిపోయారు.మొన్నటి వరకు లోకేష్ దూకుడుగా వ్యవహరించారు.
పార్టీకి సంబంధించి అనేక నిర్ణయాలు ప్రకటించారు.నిత్యం ఏదో ఒక పర్యటనతో పార్టీ నాయకులు, జనాల్లో ఉండేందుకు ప్రయత్నించారు.
అయితే ఎన్నికల దగ్గర పడిన నేపథ్యంలో మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన లోకేష్ ఒక్కసారిగా సైలెంట్ అవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.గత నెల రోజులుగా లోకేష్ పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.
విశాఖ లో లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసిన తర్వాత భోగాపురంలో భారీ బహిరంగ సభ( Bhogapuram )ను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇక తర్వాత నుంచి మీడియా ముందుకు లోకేష్ రాలేదు.దీంతో లోకేష్ సైలెంట్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి అనేది తెలియక మీడియా, రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
అయితే మీడియాకు లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో టిడిపి ,జనసేన పొత్తుల గురించి ఎక్కువగా మాట్లాడడం , జనసేన, టిడిపి ఉమ్మడిగా అధికారంలోకి వస్తే పవన్ ను ముఖ్యమంత్రి చేస్తారా అనే మీడియా ప్రశ్నకు సమాధానం గా ఐదేళ్ల పాటు సీఎంగా చంద్రబాబు ఉంటారని, పవర్ షేరింగ్ ఉండదు అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు ఉపముఖ్యమంత్రి పదవిని అయిన జనసేనకు( Janasena ) ఇస్తున్నారా అనే దానిపైన స్పందించిన లోకేష్ అది టిడిపి పొలిట్ బ్యూరో నిర్ణయించాల్సి ఉన్నట్టు గా వ్యాఖ్యానించారు.
దీనిపై జనసేన నాయకుల్లో తీవ్ర అసంతృప్తి రేగింది.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పైన కాపు సామాజిక వర్గం పెద్దలు ఒత్తిడి పెంచారు. సీఎం పదవి విషయంలో పవర్ షేరింగ్ ఉండాలని, అలా లేకపోతే ప్రయోజనం ఉండదంటూ ఒత్తిడి చేయడం, దీనిపై పవన్ సైతం కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా వ్యవహరిస్తుండడం తదితర కారణాలతోనే చంద్రబాబు సూచనల మేరకు లోకేష్ సైలెంట్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.