మాస్ రాజా అతనికి ఓకే చెప్పాడా..?

మాస్ మహరాజ్ రవితేజ( Ravi Teja ) ఏప్రిల్ 7న రావణాసుర సినిమాతో వస్తున్నారు.ధమాకా హిట్ జోష్ లో ఉన్న రవితేజ ఈ సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

 Raviteja Harish Shankar Combination Movie , Harish Shankar, Raviteja , Ustad Bha-TeluguStop.com

ఈ సినిమా తర్వాత రవితేజ డైరెక్టర్స్ లిస్ట్ లో చాలామంది ఉన్నారు.అయితే త్వరలో రవితేజతో ఒక ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

రవితేజ హీరోగా వచ్చిన షాక్ సినిమాతో డైరెక్టర్ గా మారిన హరీష్ శంకర్( Harish Shankar ) ఆ తర్వాత అదే రవితేజతో మిరపకాయ్ సినిమాతో హిట్ కొట్టారు.ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబోలో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

రవితేజ కథ నచ్చితే డైరెక్టర్ కి ముందు హిట్లు ఉన్నాయా ఫ్లాపులు ఉన్నాయా అని ఆలోచించడు.హరీష్ శంకర్ ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagat Singh ) సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత రవితేజతో ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.రవితేజతో హ్యాట్రిక్ సినిమా మామూలుగా ఉండదని టాక్.రవితేజ హరీష్ కాంబో మాస్ ఆడియన్స్ కు మస్త్ ఎంటర్టైన్ అందిస్తుందని చెప్పొచ్చు.హరీష్ పవన్ సినిమా తర్వాత రవితేజతో సినిమా నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube