బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) పఠాన్ సినిమా సక్సెస్ తో తన మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే.పఠాన్( Pathan ) సక్సెస్ తో షారుఖ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య సైతం ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.
ఇతర భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న షారుఖ్ ఖాన్ తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేయడం గమనార్హం.రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్( Rolls Royce Cullinan Black Badge ) కారును ఆయన కొనుగోలు చేశారు.
ఈ కారు ఖరీదు ఏకంగా 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది.ఇండియాలోని అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి అని తెలుస్తోంది.ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే షారుఖ్ ఖాన్ 10 కోట్ల రూపాయలు పెట్టి కారును కొనుగోలు చేయడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ కారు ఎక్స్ షోరూం ధర 8.2 కోట్ల రూపాయలు( 8.2 crore rupees ) కాగా షారుఖ్ లాంటి సెలబ్రిటీలు తమ అభిరుచులకు అనుగుణంగా ఈ కారులో మార్పులు చేసుకుంటారు.అందువల్ల ఈ కారు ధర 10 కోట్ల రూపాయలుగా ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.షారుఖ్ ప్రస్తుతం వరుసగా, వేగంగా సినిమాలలో నటిస్తున్నారు.అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ జవాన్( Jawan ) సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండగా దక్షిణాది భాషల్లో కూడా రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.షారుఖ్ ఈ సినిమాతో సౌత్ ఇండియాలో కూడా సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.షారుఖ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
షారుఖ్ ఖాన్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.







