20 ఏళ్ల తర్వాత రవితేజ సినిమా కి సీక్వెల్ వస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా( Amma Nanna O Tamila Ammai ) తెలుగులో మంచి విజయం సాధించడంతో పాటుగా తనదైన రీతిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అలాగే రవితేజ( Raviteja ) కెరియర్ లో అత్యంత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా ఒకటి.

 Raviteja Amma Nanna O Tamila Ammai Movie Tamil Remake Sequel Details, Jayam Ravi-TeluguStop.com

ఇక ఈ సినిమా తెలుగులో సక్సెస్ అయిన వెంటనే ఈ సినిమాని తమిళంలో డైరెక్టర్ మోహన్ రాజా ఎం కుమారన్ సన్నాఫ్ మహాలక్ష్మి( M.Kumaran Son Of Mahalakshmi ) అనే పేరుతో రీమేక్ చేశారు.ఈ సినిమాలో జయం రవి( Jayam Ravi ) హీరోగా నటించాడు.తల్లి గా నదియా నటించి తనదైన గుర్తింపును సంపాదించుకుంది.

Telugu Ammananna, Mohan Raja, Puri Jagannath, Jayam Ravi, Mkumaranson, Raviteja-

ఇక ఇలాంటి క్రమంలోనే 2004 లో వచ్చిన ఈ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ చేసే పనిలో డైరెక్టర్ మోహన్ రాజా( Director Mohan Raja ) ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే కథకు సంబంధించిన చర్చలు నడుస్తున్నట్టుగా చాలా రకాల వార్తలయితే వస్తున్నాయి.దాదాపు 20 సంవత్సరాల తర్వాత సినిమాకి సీక్వెల్ రావడం అనేది ఒక గొప్ప విషయమనే చెప్పాలి.ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎంతవరకు తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

 Raviteja Amma Nanna O Tamila Ammai Movie Tamil Remake Sequel Details, Jayam Ravi-TeluguStop.com

ఒకవేళ తమిళంలో గనక ఈ సినిమా హిట్ అయితే పూరి జగన్నాథ్( Puri Jagannath ) ఆ స్టోరీ తో ఈ సినిమాని ఇక్కడ రీమేక్ చేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Ammananna, Mohan Raja, Puri Jagannath, Jayam Ravi, Mkumaranson, Raviteja-

ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ ఇండస్ట్రీని ఒక వంతుకు మెచ్చుకోవచ్చు.ఎందుకంటే మంచి కంటెంట్ తో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కి సీక్వెల్ గా ఒక మంచి కథని రెడీ చేసుకుని ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తీయాలనే ఉద్దేశ్యం లో మేకర్స్ ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో పెద్దగా కంటెంట్ ఏమీ లేకపోయిన కూడా మాస్ మసాలా అంశాలతో సినిమాలని చుట్టేస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలో మోహన్ రాజా ఈ సినిమా విషయం లో ఒక రకం సాహసం చేస్తున్నాడనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube