20 ఏళ్ల తర్వాత రవితేజ సినిమా కి సీక్వెల్ వస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా( Amma Nanna O Tamila Ammai ) తెలుగులో మంచి విజయం సాధించడంతో పాటుగా తనదైన రీతిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

అలాగే రవితేజ( Raviteja ) కెరియర్ లో అత్యంత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా ఒకటి.

ఇక ఈ సినిమా తెలుగులో సక్సెస్ అయిన వెంటనే ఈ సినిమాని తమిళంలో డైరెక్టర్ మోహన్ రాజా ఎం కుమారన్ సన్నాఫ్ మహాలక్ష్మి( M.

Kumaran Son Of Mahalakshmi ) అనే పేరుతో రీమేక్ చేశారు.ఈ సినిమాలో జయం రవి( Jayam Ravi ) హీరోగా నటించాడు.

తల్లి గా నదియా నటించి తనదైన గుర్తింపును సంపాదించుకుంది. """/" / ఇక ఇలాంటి క్రమంలోనే 2004 లో వచ్చిన ఈ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ చేసే పనిలో డైరెక్టర్ మోహన్ రాజా( Director Mohan Raja ) ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే కథకు సంబంధించిన చర్చలు నడుస్తున్నట్టుగా చాలా రకాల వార్తలయితే వస్తున్నాయి.దాదాపు 20 సంవత్సరాల తర్వాత సినిమాకి సీక్వెల్ రావడం అనేది ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎంతవరకు తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

ఒకవేళ తమిళంలో గనక ఈ సినిమా హిట్ అయితే పూరి జగన్నాథ్( Puri Jagannath ) ఆ స్టోరీ తో ఈ సినిమాని ఇక్కడ రీమేక్ చేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ ఇండస్ట్రీని ఒక వంతుకు మెచ్చుకోవచ్చు.

ఎందుకంటే మంచి కంటెంట్ తో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కి సీక్వెల్ గా ఒక మంచి కథని రెడీ చేసుకుని ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తీయాలనే ఉద్దేశ్యం లో మేకర్స్ ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో పెద్దగా కంటెంట్ ఏమీ లేకపోయిన కూడా మాస్ మసాలా అంశాలతో సినిమాలని చుట్టేస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలో మోహన్ రాజా ఈ సినిమా విషయం లో ఒక రకం సాహసం చేస్తున్నాడనే చెప్పాలి.

కాఫీ డార్క్ సర్కిల్స్ ను పొగొడుతుందా?