రంగస్థలం లో రామలక్ష్మి పాత్రకి సమంత కి బదులుగా ఫస్ట్ ఎవర్ని అనుకున్నారో తెలుసా.?     2018-07-02   00:31:43  IST  Raghu V

అట్టా గిల్లేత్తావేటీ…గాజులు కొనిపెట్టమంటే…”‘ఆ… పేమంటే ఇంతే మరి ఇలాగే సెప్తారు. నీకినపడదని ఓ అరిసి సెప్పరు”అంటూ రంగస్థలంలో సమంత డైలాగ్ చెప్తుంటే విజిల్సే విజిల్స్. వేరుశెనగా కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే… రామలచ్చిమిలా అందరి మనసుల్ని దోచేసింది సమంతా.! అయితే ఈ సినిమాలో రామలక్ష్మి పాత్రలో సమంతకి బదులుగా ముందు ఏ హీరోయిన్ ని అనుకున్నారో తెలుసా.? అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే.?

“రంగస్థలంలోని రామలక్ష్మి పాత్ర కోసం తొలుత నన్నే సంప్రదించారు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయా. ఆ తర్వాత సినిమా చూశాను. సమంత చాలా బాగా నటించింది. రామలక్ష్మి పాత్రకి తను మాత్రమే న్యాయం చేయగలదు అనిపించింది.. ఆ విషయాన్ని దర్శకుడు సుకుమార్‌కి కూడా చెప్పాను. ఇటీవల విడుదలైన మహానటి సినిమాలో కీర్తి సురేశ్ కూడా చక్కగా నటించింది. ఇలాంటి పాత్రలు తెరపై చూసినప్పుడు నటిగా నేను స్ఫూర్తి పొందుతా. ప్రస్తుతం తెలుగుపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. అఆ సినిమా సెట్‌లో అందరూ తెలుగు మాట్లాడేవారు. త్రివిక్రమ్‌గారు ప్రతి పదాన్ని విడమర్చి స్పష్టంగా అర్థం చెప్పడంతో నేను సులువుగా నేర్చుకోగలిగాను” అని అనుపమ పరమేశ్వరన్ వెల్లడించింది.

సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి ఆమె నటించిన ‘తేజ్ ఐ లవ్‌ యూ’ సినిమా రానున్న శుక్రవారం ప్రేక్షకులముందుకు రానుంది. దర్శకుడు కరుణాకరన్ చాలా బాగా తెరకెక్కించాడని కితాబిచ్చింది అనుపమ.