‘బాహుబలి’ సినిమాతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి తాజాగా బాలీవుడ్లో విడుదలైన ‘భజరంగీ భాయిజాన్’ సినిమాపై స్పందించాడు.తన ఇమేజ్ను పక్కకు పెట్టి, హీరోయిజం చూపించే అవకాశం లేకున్నా కూడా కథపై నమ్మకంతో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నందుకు అభినందనీయుడు.
సల్మాన్‌తో పాటు చిన్నారి హర్షాలి కూడా ఈ సినిమాలో అద్బుతమైన పాత్రను పోషించి, మంచి నటనతో ఆకట్టుకుంది.ఒక మంచి కథతో తెరకెక్కిన ఈ సినిమా హృదయాలకు దగ్గరయ్యేలా ఉంది అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు.
సల్మాన్ ఖాన్ కెరీర్లోనే అత్యధిక వేగంగా వంద కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమా నిలిచింది.దేశ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్‌తో దూసుకు పోతుంది.
పాకిస్థాన్‌లో సైతం ఈ సినిమాకు మంచి ఆధరణ భిస్తోంది.ఇలాంటి పాత్ర చేసేందుకు ఒప్పుకున్న సల్మాన్ ఖాన్ అభినందనీయుడు అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఈ సినిమాకు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన విషయం తెల్సిందే.చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ కథకు కాస్త పోలికలు ఉన్నా కూడా, స్క్రీన్‌ప్లే విషయంలో ఈ రెండు సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది.