జమ్మూకశ్మీర్ లో రాహుల్ భారత్ జోడో యాత్రకు బ్రేక్

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు జమ్మూకశ్మీర్ లో బ్రేక్ పడింది.భద్రతా వైఫల్యంతో రాహుల్ గాంధీ యాత్ర నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

 Rahul's Bharat Jodo Tour Breaks In Jammu And Kashmir-TeluguStop.com

కశ్మీర్ లోయలోకి ప్రవేశించే ముందు యాత్ర ఆగిపోయింది.

జనం రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ఎక్కడా కనిపించలేదని తెలుస్తోంది.

దీంతో పాదయాత్రను నిలిపివేయాలని రాహుల్ భద్రతా సిబ్బంది కోరడంతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు.దీంతో తాత్కాలిక విరామం తీసుకుని బస చేసే స్థలానికి రాహుల్ చేరుకున్నారు.

అయితే భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.మరోవైపు కాంగ్రెస్ వాదనలను జమ్మూకశ్మీర్ పోలీసులు కొట్టిపడేశారు.

యాత్రకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించామని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube