జమ్మూకశ్మీర్ లో రాహుల్ భారత్ జోడో యాత్రకు బ్రేక్

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు జమ్మూకశ్మీర్ లో బ్రేక్ పడింది.

భద్రతా వైఫల్యంతో రాహుల్ గాంధీ యాత్ర నిలిచిపోయినట్లు తెలుస్తోంది.కశ్మీర్ లోయలోకి ప్రవేశించే ముందు యాత్ర ఆగిపోయింది.

జనం రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ఎక్కడా కనిపించలేదని తెలుస్తోంది.దీంతో పాదయాత్రను నిలిపివేయాలని రాహుల్ భద్రతా సిబ్బంది కోరడంతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు.

దీంతో తాత్కాలిక విరామం తీసుకుని బస చేసే స్థలానికి రాహుల్ చేరుకున్నారు.అయితే భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ వాదనలను జమ్మూకశ్మీర్ పోలీసులు కొట్టిపడేశారు.యాత్రకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించామని చెబుతున్నారు.

పాస్‌పోర్ట్ లేకుండా ఇండియాలోకి ఎంట్రీ.. బంగ్లా యూట్యూబర్‌ షాకింగ్ ఇన్ఫో..