చైనాకు చెక్, భారత్ వ్యాక్సిన్లకు అగ్రరాజ్యాల దన్ను.. రేపు మోడీతో బైడెన్ భేటీ

కరోనా సంక్షోభ కాలంలో భారతదేశం తన మానవత్వాన్ని చాటుకుంది.శాంతిని, విశ్వ మానవ శ్రేయస్సును ఆకాంక్షించే మనదేశం తొలి నాళ్లలో పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ కిట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది.

 Quad Leaders Virtual Summit To Be Held On March 12 Pm Modi To Meet Joe Biden Vir-TeluguStop.com

అయితే దేశంలోని సంస్థల సాయంతో అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో కోవిడ్‌పై పోరుకు కావాల్సిన సామగ్రిని సొంతంగానే సమకూర్చుకుంది.ఇదే సమయంలో వీటిని పొందలేని పేద దేశాలకు అవసరమైన సాయం అందించింది.

ఆ తర్వాత హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లు కోవిడ్‌ను అడ్డుకుంటున్నట్లు తెలియగానే ప్రపంచం ఇండియా ముందు క్యూ కట్టింది.అప్పుడు కూడా భారత్ లోక కళ్యాణాన్ని ఆశించింది.

ఏ దేశం అడిగినా కాదనకుండా వారికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ డ్రగ్స్‌ను సరఫరా చేసింది.

ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇండియా ప్రాధాన్యత మరింత పెరిగింది.

దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కొవాగ్జిన్‌లను మన అవసరాలకు వుంచుకుని.పేద, మధ్య స్థాయి దేశాలకు ఎగుమతి చేసింది.

దాదాపు 65 దేశాలకు పైగా టీకాలను అందించింది.చివరికి మనకు పక్కలో బల్లెంలా, ప్రతినిత్యం ఇండియా నాశనాన్ని కోరుకునే పాకిస్తాన్‌కు సైతం వ్యాక్సిన్‌ డోసులను పంపేందుకు ముందుకొచ్చింది.

కోవిడ్‌పై పోరులో భారత్ పాత్రను ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఎన్నో సంస్థలు, దేశాలు ప్రశంసించాయి.అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు కోవిడ్ నుంచి భారత్ ప్రపంచాన్ని రక్షించిందని కొనియాడారు.

అయితే మన ఉన్నతిని చూసి ఓర్చుకోలేని కొన్ని శక్తులకు చెక్ పెట్టేందుకు అంతర్జాతీయ సమాజం బాసటగా నిలిచింది.దాదాపు 50 దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్న భారత్‌కు అండదండలు అందించేందుకు క్వాడ్ దేశాలు (భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా) ముందుకు వస్తున్నాయి.

Telugu America, Biden, China, India, Modi-Telugu NRI

శుక్రవారం వర్చువల్ ద్వారా జరగనున్న సమావేశంలో క్వాడ్ దేశాధినేతలు భేటీకానున్నారు.భారత దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు నిధులను సమకూర్చడానికి సంబంధించిన ఒప్పందాలను క్వాడ్ గ్రూప్ సమావేశంలో ప్రకటించనున్నారు.వ్యాక్సిన్ తయారీ భారాన్ని తగ్గించుకోవడం, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం, కరోనా వైరస్ మ్యుటేషన్లను దెబ్బతీయడం లక్ష్యంగా ఈ ఒప్పందాలను ప్రకటించనున్నారు.తద్వారా భారత్‌లో అదనంగా పెరిగే వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని ఆగ్నేయాసియా దేశాల కోసం ఉపయోగించనున్నారు.

కాగా, జో బైడెన్‌ అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత ప్ర‌ధాని మోడీతో ఆయన తొలిసారి సమావేశం కానున్నారు.చైనాతో అమెరికా, ఆస్ట్రేలియాలు క‌య్యానికి దిగడం, ప‌లు ద్వైపాక్షిక‌, వాణిజ్య అంశాల్లో చైనాతో ఆ రెండు దేశాలకు తీవ్రస్థాయిలో విభేదాలు రావడం తెలిసిందే.

ఇటీవ‌ల స‌రిహ‌ద్దు అంశంలో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రేపటి క్వాడ్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube