కొంతమంది వ్యక్తులు జంతువులను కాపాడుతుంటే మరి కొంతమంది వాటి ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు.కొట్టడం లేదంటే వివిధ రకాలలో హింసించడం చేస్తున్నారు.
ముఖ్యంగా కుక్కలు( Dogs ) కొంతమంది క్రూరమైన మనుషుల వల్ల చాలా నరకయాతన అనుభవిస్తున్నాయి.ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఒక్కోసారి వైరల్ అవుతున్నాయి.
వారిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.తాజాగా కొంతమంది యువకులు ఒక చిన్న కుక్క పిల్ల చేత మద్యం తాగించారు.
ఆ కుక్కను బలవంతంగా మద్యం( Alcohol ) తాగించిన వీడియోను చూసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వీడియో ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
ఈ యువకులు చలిమంట వేసుకొని డ్రింక్ చేస్తున్నారు, అక్కడికి వచ్చిన ఒక కుక్క చేత ప్లాస్టిక్ కప్పులోని మద్యం తాగేలా చేశారు.లిక్కర్ తాగుతున్న కుక్కను చూసి వారు నవ్వారు.
కుక్క చాలా చిన్నది, మద్యం వల్ల చనిపోవచ్చు.
రాజస్థాన్‌లోని( Rajasthan ) సవాయ్ మాధోపూర్ అనే ప్రదేశంలో ఈ వీడియో షూట్ చేయడం జరిగింది.పూనమ్ బగ్రీ అనే మహిళ ఆ వీడియోను చూసి ఎక్స్‌లో షేర్ చేసింది.ఆమె జంతువులను రక్షించే ప్రభుత్వ సంస్థ అయిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో( Animal Welfare Board Of India ) పని చేస్తుంది.
కుక్కతో ఇలా చేసిన వారిని శిక్షించాలని పోలీసులను, కొందరు మంత్రులను కోరింది.ఈ యువకులలో ఒకరి ఫేస్‌బుక్ ప్రొఫైల్ కూడా కనుక్కుని అందరికీ చూపించింది.అతనికి చాలా మంది ఫాలోవర్లు ఉన్నారని, కానీ అతను జంతువులకు హాని చేస్తున్నాడని ఆమె చెప్పింది.
ఇలాంటి ప్రవర్తన వల్ల కుక్కల మానసిక పరిస్థితి చెడుతోందని, అప్పుడు అవి మనుషులను కాటువేస్తాయని, మనుషులు జంతువుల బతుకులను మరింత కష్టంగా మారుస్తున్నారని ఆమె చెప్పింది.ఎక్స్‌లోని రాజస్థాన్ పోలీస్ హెల్ప్‌డెస్క్ ఆమె పోస్ట్‌ని చూసి, సవాయ్ మాధోపూర్‌లోని( Sawai Madhopur ) పోలీస్ స్టేషన్‌కి చర్య తీసుకోమని చెప్పింది.ఫిర్యాదును పరిష్కరించాల్సిందిగా తమ అధికారులకు చెప్పినట్లు పోలీసు స్టేషన్ సిబ్బంది వెల్లడించింది.
ఆల్కహాల్ కుక్కలకు చాలా ప్రమాదకరమైనది, వాటి ప్రాణాలను కూడా మద్యం తీసేయగలదు.మద్యం కుక్కలను స్పృహ కోల్పోయేలా చేస్తుంది, వాంతులు, వణుకు, మూర్ఛలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డీహైడ్రేషన్‌కు కూడా గురి చేస్తుంది.