ఈ కొత్త హీరోయిన్ చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయా ?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి బాగా చదువుకున్న వారే వస్తువు ఉండడం గమనించాల్సిన విషయం.డాక్టర్స్ గా పని చేస్తున్న సాయి పల్లవి వంటి వారు హీరోయిన్ గా కెరియర్ కొనసాగిస్తున్నారు.

 Priya Bhavani Shankar Upcoming Movies , Priya Bhavani Shankar , Tollywood, Kolly-TeluguStop.com

ఎలాంటి వారికైనా సినిమానే మంచి కెరియర్ ఆప్షన్ గా కనిపిస్తోంది.ఇక కళ్యాణం కమనీయం అంటూ సంతోష్ శోభన్ నటించిన సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియా భవాని శంకర్.

ఈమె బీటెక్ చదివి ఎంబీఏ కూడా చేసి మీడియా ఇండస్ట్రీలో న్యూస్ రీడర్ గా పనిచేసింది.

చెన్నైలో పుట్టి పెరిగిన ప్రియా అక్కడే తన చదువులు కూడా పూర్తి చేసుకుంది.ఆ తర్వాత తమిళ మీడియాలో న్యూస్ రీడర్ గా పనిచేసింది.2017లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.అన్ని లీడ్ రోల్స్ చేయాలని ఆలోచించకుండా వచ్చిన ప్రతి అవకాశాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వెళ్తోంది.కరోనాలో ఎవరికి సినిమాలు లేని సమయంలో కూడా ఆమె తొమ్మిది చిత్రాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు.

ఇక ఇప్పుడు ఏకంగా ఆమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ చేతిలో ఒకటి రెండు సినిమాలు ఉంటే గొప్ప అని భావిస్తున్నారు అయినా కూడా ప్రియా చేతిలో ఇన్ని చిత్రాలు ఉండటం బట్టి చూస్తే ఆమె టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మరి మహానటి అనలేము కానీ మంచి నటి అని చెప్పవచ్చు.ఇక నాగచైతన్యతో కూడా దూత చిత్రం లో నటిస్తోంది.తనకు ఫీల్ గుడ్ సినిమాలు చేయడం అంటే ఇష్టమని, లీడ్ రోల్ కాకపోయినా ప్రాధాన్యత ఉంటే సరిపోతుందని తనకు తెలుగులో మరిన్ని సినిమాలో నటించాలి అని ఉందని ఎంతో హంబుల్ గా చెప్పింది ప్రియా భవాని.మరి ఇలాంటి హీరోయిన్స్ ని తెలుగు చిత్ర పరిశ్రమ ఏ మేరకు ఎంకరేజ్ చేస్తుందో చూడాలి.

తమిళ్, తెలుగు తో పాటు కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో కూడా ఆమె ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube