డ్రాగన్ ఫ్రూట్ పంటను నాటుకునే విధానం లో పాటించాల్సిన జాగ్రత్తలు..!

తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు( Dragon Fruit Farming ) విస్తీర్ణం పెరుగుతోంది.తక్కువ నీటి సౌకర్యం ఉండే నేలలలో ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేసి మంచి ఆదాయం పొందవచ్చు.

 Precautions To Be Followed In Planting Dragon Fruit Crop-TeluguStop.com

గతంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట సాగును దిమ్మెలు పాతి దానిపై ఒక టైర్ అమర్చి, మొక్కలు పైకి పాకే విధంగా ఏర్పాటు చేసేవారు.ఈ పద్ధతిని చాలామంది చూసే ఉంటారు.

కానీ ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్( Dragon Fruit ) తోటలు అభివృద్ధి చేయవచ్చు.సాలుల మధ్య 14 అడుగుల దూరం, దిమ్మెల మధ్య 14 అడుగుల దూరం ఉండేటట్లు దిమ్మెలు నాటుకోవాలి.ఆ తరువాత కరెంట్ స్తంభాలకు విద్యుత్ తీగల లైన్ ఎలా వేస్తారో అలాగే.ఈ దిమ్మెలకు కూడా నాలుగు వరసలతో లైన్ వేయాలి.దిమ్మెల కింద ఒకదాని పైన ఒకటి ప్రకారం మూడు వైర్లు లాగాలి.ఈ వైర్ల కింద మొక్కల మధ్య అడుగు దూరం ఉండేటట్టు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటుకోవాలి.

ఈ మొక్కలు క్రమంగా పెరిగి పైన వేసిన నాలుగు లైన్ల తీగలకి అల్లుకుంటాయి.ఇలా చేస్తే ఒక ఎకరం పొలంలో ఏకంగా 7 వేల మొక్కలు నాటుకోవచ్చు.

ఈ పద్ధతిలో సాగు చేస్తే సాలుల మధ్య దూరం 14 అడుగులు ఉంటుంది కాబట్టి ఇతర పంటలను అంతర పంటగా కూడా సాగు చేసే అవకాశం ఉంటుంది.ఇక డ్రాగన్ ఫ్రూట్ పంటకు కలుపు సమస్య( Weed problem ) లేకుండా, మొక్కల వద్ద తేమ ఆరిపోకుండా ఉండాలంటే మల్చింగ్ షీట్లను ఉపయోగించాలి.ఈ మల్చింగ్ వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.ఈ పద్ధతులు పాటించి సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube