Sugarcane Cultivation : వేసవిలో చెరుకు పంటను సాగు చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

చెరుకు( Sugarcane ) 12-18 నెలల పంట.అయితే వేసవికాలంలో చెరుకు తోటల్లో కొన్ని యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.

 Precautions For Sugarcane Cultivation-TeluguStop.com

ముఖ్యంగా వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా పంటకు నీటి తడులను పుష్కలంగా అందించాలి.ఒకటన్ను చెరుకు పంటకు 125 నుండి 200 టన్నుల నీటి ఉపయోగం( Water Usage ) అవసరం.

తక్కువ నీటి వనరులు ఉండి అధిక దిగుబడును పొందాలంటే నీటి వినియోగ సామర్ధ్యాన్ని పెంచుకోవాలి.మామూలుగా అయితే చెరుకు పంటకు కేవలం 40-60 శాతం నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది.

రైతులు( Farmers ) సరైన సమయంలో సరైన విధానంలో పంటకు నీటి తడులు అందిస్తే తక్కువ నీటితో కూడా మంచి దిగుబడులు పొందవచ్చు.

Telugu Agriculture, Farmers, Sugarcane-Latest News - Telugu

చెరుకు పైరు నాటిన రోజు నుండి 45 రోజుల వరకు 300 మి.మీ నీరు అవసరం అవుతుంది. 45 రోజుల నుండి 120 రోజుల వరకు సుమారుగా 600 మి.మీ నీరు అవసరం.చెరుకు పంట నాలుగు నెలల వయసుకు వచ్చాక 800 మి.మీ నీరు అవసరం.ఇక నాలుగు నెలల వయసు దాటాక పంటకు 1000మి.

మీ నీరు అవసరం అవుతుంది.కాబట్టి పంట దశను బట్టి సరైన మోతాదులో నీటి తడులు అందించాల్సి ఉంటుంది.

నేల స్వభావాన్ని బట్టి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి.

Telugu Agriculture, Farmers, Sugarcane-Latest News - Telugu

ముఖ్యంగా చెరుకు రైతులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే పంట నాటేటప్పుడు నీరు అధికమైతే బూజుపట్టే అవకాశం ఉంది.అలా అని పంట నీటి ఎద్దడికి గురైతే పిలకల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.పంట నాటిన నాలుగు నుంచి ఐదు నెలల వరకు పంట నీటి ఎద్దడికి గురి కాకుండా పది రోజుల వ్యవధిలో ఒకసారి తేలికపాటి నీటి తడులు అందించాలి.

అందుకే పంట సాగు చేయడానికి ముందే తాగు విధానంపై అవగాహన ఉండాలి.చెరుకు పంట తక్కువ దశకు చేరుకున్న తర్వాత కొద్దిపాటి నీటి ఎద్దడికి గురైనట్లయితే పంచదార శాతం( Sugar Percentage ) పెరిగే అవకాశం ఉన్నందున నీటి తడువుల మధ్య వ్యవధి పెంచవలసి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube