పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) నటించినటువంటి తాజా చిత్రం సలార్ ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమాకు సీక్వెల్ సినిమా కూడా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.
త్వరలోనే సలార్ 2(Salaar 2) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమా గురించి అభిమానులకు ఎన్నో రకాల ప్రశ్నలు సందేహాలు ఉన్నాయి అని చెప్పాలి.ఈ క్రమంలోనే సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) భార్య లిఖిత రెడ్డి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
ఇలా అభిమానులు అడిగినటువంటి ప్రశ్నలకు ఈమె తరదైన శైలిలోని సమాధానం చెప్పారు.ముఖ్యంగా దేవ తండ్రి ఎవరు? దేవా వరదరాజ్ శత్రువులుగా మారడానికి కారణం ఏంటి? అంటూ చాలామంది ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడంతో ఈమె కూడా సరైన సమాధానాలన్నిటిని దాచేస్తూ సినిమా పై మరింత ఆసక్తి కలిగేలా సమాధానాలు చెప్పారు.ఇకపోతే ఈ సినిమాలో అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) కూడా నటిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి ఇదే ప్రశ్నను అభిమానులు ప్రశాంత్ భార్యను అడిగారు.
ఈ సినిమాలో అఖిల్ అతిథి పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటూ ఈమెను ప్రశ్నించడంతో లిఖిత( Likitha Reddy ) ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ అఖిల్ ఈ సినిమాలో నటిస్తున్నారు అనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఇదంతా కేవలం పుకార్లు మాత్రమే అంటూ సమాధానం చెప్పారు.ఇటీవల సలార్1 సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో అఖిల్ కనిపించడంతో అందరికీ సందేహాలు వచ్చాయి కానీ లిఖితారెడ్డి సమాధానంతో అందరికీ క్లారిటీ వచ్చిందని.