Prashanth Varma : రామాయణం వాళ్లు తియ్యకపోతే నేను కచ్చితంగా తీస్తా.. ప్రశాంత్ వర్మ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు కూడా ఒకటి. హనుమాన్( Hanuman ) తరువాత దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమోగిపోతుంది.

 Prasanth Varma Said He Will Do Ramayana Movie If Bollywood Will Not Make It-TeluguStop.com

ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు తనకున్న క్రేజ్ ని మరింత పెంచుకున్నారు ప్రశాంత్ వర్మ.ఇకపోతే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) తదుపరి సినిమాల విషయంలో అభిమానులకు క్యూరియాసిటీ పెరిగిపోయింది.

హనుమాన్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన ఈ దర్శకుడు మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు తెరకెక్కించబోతున్నారు.

Telugu Bollywood, Prashanth Varma, Hanuman, Nitesh Tiwari, Prasanth Varma, Ramay

ఇక ఈ ప్రాజెక్ట్స్ గురించి ప్రశాంత్ వర్మ ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.ఇక ఈ ఇంటర్వ్యూలో బాలీవుడ్ రామాయణ టాపిక్ చర్చకి వచ్చింది. నితీష్ తివారి( Nitesh Tiwari ) రామాయణ కథని మూడు పార్టులుగా తెరకెక్కించబోతున్నారని, అందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయం గురించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.రామాయణ కథ మన జీవితాశైలిని సరైన దారిలో నడిచేలా చేస్తుంది.అందుకే ప్రతి జనరేషన్ కి రామాయణం చెప్పాల్సిన అవసరం మనకి ఉంది.

Telugu Bollywood, Prashanth Varma, Hanuman, Nitesh Tiwari, Prasanth Varma, Ramay

ఆ కథని చెప్పడంలో కూడా మనం పద్ధతిగా వ్యవహరించాలి.ఒకవేళ రామాయణం వాళ్ళు తియ్యకపోతే, నేను కచ్చితంగా చేస్తాను అని తెలిపారు ప్రశాంత్ వర్మ.ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారాయి.

కాగా ప్రశాంత్ వర్మ మహాభారతం( Mahabharatam ) కూడా తెరకెక్కించాలని అనుకున్నట్లు, కానీ రాజమౌళి మహాభారతం తన డ్రీం ప్రాజెక్ట్ గా పెట్టుకోవడంతో తాను తెరకెక్కించాలి అనే ఆలోచనని విరమించుకున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.ఇక హనుమాన్ సినిమా చూసిన తరువాత ఆడియన్స్ ప్రశాంత్ వర్మ రామాయణ, మహాభారతం తీస్తే అదిరిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube