కరోనా దెబ్బకు భారీ సినిమాను చేజార్చుకోనున్న పూజా  

Pooja Hegde To Lose Salman Khan Movie - Telugu Akhil, Most Eligible Bachelor, Pooja Hegde, Prabhas 20, Salman Khan

టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనే సంగతి అందరికీ తెలసిందే.ఈ బ్యూటీ ప్రస్తుతం అందరూ హీరోలతో సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది.

 Pooja Hegde To Lose Salman Khan Movie - Telugu Akhil, Most Eligible Bachelor, Pooja Hegde, Prabhas 20, Salman Khan-Gossips-Telugu Tollywood Photo Image

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి యంగ్ హీరోతో సినిమాకు సై అంటోంది ఈ అందాల భామ.అయితే ఈమె ఎంత బిజీగా మారుతుందంటే కొన్ని సినిమాలను డేట్లు ఖాళీ లేకపోవడంతో వదులుకోవాల్సి వస్తుంది.

కానీ తాజాగా నెలకొన్న కరోనా వైరస్ ప్రభావం వల్ల కూడా పూజా హెగ్డే ఓ భారీ సినిమాను వదులుకోనుంది.ప్రస్తుతం పూజా హెగ్డే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా దెబ్బకు భారీ సినిమాను చేజార్చుకోనున్న పూజా - Pooja Hegde To Lose Salman Khan Movie - Telugu Akhil, Most Eligible Bachelor, Pooja Hegde, Prabhas 20, Salman Khan-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల జార్జియాలో జరుపుకోగా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు.ఇక అక్కినేని బుల్లోడు అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాలో కూడా నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు.

అటు బాలీవుడ్‌లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోయే ఓ సినిమాలో హీరోయిన్‌గా పూజా సెలెక్ట్ అయ్యింది.

అయితే పరిస్థితులు సాధారణం కాగానే పూజా వెంటనే ప్రభాస్ 20వ చిత్రం, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.దీంతో సల్మాన్ ఖాన్ సినిమాను ఆమె వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరి ఈ పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

తాజా వార్తలు

Pooja Hegde To Lose Salman Khan Movie Related Telugu News,Photos/Pics,Images..