ఎన్టీఆర్ జిల్లాలో బ్యాంక్ అధికారులు,సబ్ రిజిస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట: బ్యాంకుకు తాకట్టు పెట్టని స్థలాన్ని ఈ – ఆక్షన్ లో అమ్మివేసిన జగ్గయ్యపేట నందిగామ ఎస్బిఐ మేనేజర్లపై కేసు నమోదు చేసినట్లు జగ్గయ్యపేట ఎస్సై బీవీ రామారావు తెలిపారు.పట్టణంలోని మార్కండేయ బజార్లో 1.47 నంబర్ లో గల బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి పట్నంలో ముక్త్యాల రోడ్డుకు చెందిన దేవరపల్లి జాన్ పాల్ కు 2015లో ఎస్ బి ఐ రుణం ఇచ్చింది.నిర్మాణం పూర్తయ్యాక యజమాని జాన్ పాల్ గృహవాస్తు కోసం భవనానికి అనుబంధంగా ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి టాయిలెట్ల నిర్మాణాన్ని చేశారు.

 Police Have Registered A Case Against Bank Officials And Sub Register In Ntr Dis-TeluguStop.com

కరోనా నేపథ్యంలో రుణం చెల్లించలేదని ఎస్ బి ఐ ఆ భవనాన్ని ఈ ఆక్షన్ లో కర్నాటి కరుణాకర్ అనే వ్యక్తికి అమ్మేసింది.తాకట్టు లో లేని తన స్థలాన్ని కూడా రుణం ఇచ్చిన భవనంతో కలిపి అమ్మేయటంపై యజమాని జాన్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసి, స్థానిక అదనపు జూనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు.

కోర్టు ప్రాథమిక ఆధారాలు ప్రకారం నందిగామ ఎస్ బి ఐ చీఫ్ మేనేజర్, జగ్గయ్యపేట ఎస్ బి ఐ మేనేజర్, ఇంటిని కొలుగోలు చేసిన కరుణాకర్, యజమాని స్థలాన్ని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసిన జగ్గయ్యపేట సబ్ రిజిస్టర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.ఈ మేరకు వారిపై 420,378 ఎస్సీ ఎస్టీ పిఏఓ చట్టప్రకారం (Cr.no.335/2022 .13/10022) కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube