ఉత్తరప్రదేశ్ లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాని మోదీ( PM Modi ) పర్యటిస్తున్నారు.రెండు రోజులపాటు వారణాసిలో( Varanasi ) వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
దీనిలో భాగంగా సోమవారం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్ వెద్ మహా మందిర్ నీ( Swarved Mahamandir ) ప్రారంభించారు.ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించడం జరిగింది.
ఇదే సమయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.ఆ తర్వాత మధ్యాహ్నం వారణాసి ఢిల్లీ మధ్య రెండో వందే భారత్ రైలు జెండా ఊపి ప్రారంభించారు.
ఇదిలా ఉంటే వారణాసిలో తన పర్యటనలో సాధారణ మహిళకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారు.విషయంలోకి వెళ్తే స్వయం సహాయక సంఘాలతో సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో ఓ మహిళ అనర్గళంగా మాట్లాడిన విధానానికి మోదీ ముగ్ధులయ్యారు.ఈ సందర్భంగా ఆమె స్పీచ్( Speech ) ఇచ్చిన అనంతరం.
మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు.ఎన్నికలలో( Elections ) పోటీ చేయాలనే ఆలోచన ఎప్పుడు చేయలేదా.? అని ప్రశ్నించడం జరిగింది.అనంతరం నేను అవకాశం ఇస్తా ఎన్నికలలో పోటీ చేయండి అని బంపర్ ఆఫర్ ఇచ్చారు.
అయితే ఆ మహిళ( Woman ) ప్రస్తుతానికి తనకి అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.