ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ.అవును.
మనలో ఎంతోమంది ఎదురుగా ఏం లేకపోయినా, ఎదో వుంది అని భ్రమ పడుతూ వుంటారు.దీనికి ఉదాహరణగా, తాడుని చెప్పుకోవచ్చు.
మనలో ఎంతోమంది కాస్త డార్క్ ప్లేసులో వున్న ఓ తాడుని చూసి, పాము (స్నేక్) అని భ్రమిస్తారు.కానీ నిజానికి అక్కడ వున్నది తాడు మాత్రమే.
అలాగే ఎండమావులను తీసుకుంటే, చాలా క్లియర్ గా మనకు అక్కడ నీళ్లు ఉన్నట్టు కనబడతాయి.కానీ అది నిజం కాదు.
అయితే ఇలాంటి వాటివలన అనేకసార్లు పెద్ద పెద్ద చర్చలే జరుగుతాయి.ఈ కోవకే చెందుతాయి కొన్ని ఫొటోస్.
అలాంటివి చూసినపుడు మనలో అనేకమైన ఊహాగానాలు మొదలవుతాయి.
తాజాగా అలాంటి ఓ ఫోటోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక్కడ వున్న ఫోటోని ఒకసారి పరిశీలిస్తే, తలలేని ఓ సెక్యూరిటీ గార్డు కాపలా ఎలా కాస్తున్నాడు అనేది మొదట మనకు అనుమానం వస్తుంది.కానీ నిశితంగా పరిశీలిస్తే, ఆ ఫొటోలోని గమ్మత్తేమిటో అర్ధం కాదు.
మనలో చాలామంది ఇంచుమించుగా ఒకేలా ఆలోచిస్తారు.అతికొద్ది మంది మాత్రమే బూతద్దం పెట్టి మరీ ఆలోచిస్తారు.
అదేనండి.నిశిత పరిశీలిన.
అతి కొద్ది మందికి మాత్రమే అనలైజింగ్ స్కిల్స్ ఉంటాయి.అలాంటివారే ఈ సమాజంలో గుర్తింపుబడతారు.మీరు ఆ లిస్టులో వున్నారో లేదో ఇలాంటి ఫొటోస్ చెప్పేస్తాయి సుమా!
సాధారణంగా రక్షణ అవసరమైన చోట ఇలాంటి సెక్యూరిటీని మనం గమనించవచ్చు.బాగానే వుంది కానీ, తల లేని సెక్యూరిటీ గస్తీ కాస్తున్నాడేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఆ ఫొటోలో వున్న జిమ్మిక్ ఇంకా అర్ధం కాలేదా? అయితే ఇంకోసారి పరిశీలించండి.నిజానికి ఈ ఫోటోలో ఉన్న సెక్యూరిటీ గార్డు హాయిగా నిద్రపోతున్నాడు.అయితే కూర్చిలో కూర్చున్న అతను.తన తలను కుర్చీ వెనక్కి వాల్చడం జరిగింది.అది డార్క్ ప్లేస్ కనుక మనకి ఎవరో తల తీసివేసినట్టు కనబడుతోంది.
కానీ వాస్తవంగా అతగాడు నిద్రపోతున్నాడు.ఇప్పుడు అర్ధం అయ్యింది కదా! ఈ ఫోటో గమ్మత్తుగా ఉండటంతో ఓ వ్యక్తి సదరు సెక్యూరిటీ గార్డును ఫోటో తీసి.
రెడిట్‌లో పోస్ట్ చేశాడు.దాంతో ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.