సీఎం జగన్‎కు మరో ఎదురుదెబ్బ..ఆర్టీసీ నిధులేవి?

ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.ఆరు దశాబ్దాలుగా ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తున్న సంస్థ.

 Ap Cm Jagan Mohan Reddy Not Concentrating On Apsrtc Problems Details, Ap Cm Jaga-TeluguStop.com

పాలకుల కరుణలేక.కాలంతీరిన బస్సులతో ప్రయాణికులను దూరం చేసుకుంటోంది.

గతంలోనూ ఆర్టీసీకి కష్టనష్టాలు వెంటాడినా.ప్రభుత్వంలో విలీనమైతే పరిస్థితి మెరుగుపడుతుందనుకుంటే.

దానికి విరుద్ధంగా మరింత దిగజారిపోతోంది.వాటిలో 24గంటలపాటు 28.97లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుకొంటున్నారు.అయినా డీజిల్‌ ధరలు, బస్సుల నిర్వహణ, అప్పులకు వడ్డీలు లెక్కిస్తే సరిపోని పరిస్థితి.

దీంతో అద్దె బస్సుల సంఖ్యను పెంచేస్తోంది.బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కొత్త బస్సులకు కేటాయించిన ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆర్టీసీని ఆదుకోవాలి.కానీ గడిచిన రెండేళ్లలో ఆ పని జరగలేదు.కానీ ఒకేసారి 998 అద్దె బస్సులకు టెండర్లు పిలవడం సంస్థలో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఆర్టీసీలో 11,236 బస్సులు ఉన్నాయి.వీటిలో సొంత బస్సులు 8,972, అద్దెవి 2,264.

మొత్తం బస్సుల్లో 3వేలు కాలం చెల్లిపోయాయి.వీటి స్థానంలో కొత్తవి తీసుకోవాలి.

కానీ యాజమాన్యం అద్దె బస్సుల బాట పడుతోంది.

అయితే ఆర్టీసీలో 25% మాత్రమే అద్దె బస్సులు తీసుకోవాలని, మిగిలినవి సొంతవే ఉండాలనే నిబంధన ఉండేది.

కొంతకాలం క్రితం పాలకవర్గ సమావేశంలో అద్దె బస్సుల వాటాను 35%కు పెంచుతూ తీర్మానించి, దాన్ని బయటపడకుండా జాగ్రత్త పడ్డారు.

Telugu Apcm, Apsrtc, Apsrtc Buses, Apsrtc Drivers, Apsrtc Problems, Passengers,

2020 మార్చిలో 250 బస్సులు కొన్నారు.తర్వాత కొత్త బస్సులపై దృష్టి పెట్టలేదు.

మరోవైపు ఆర్టీసీలో కొంతకాలంగా ఖాళీ పోస్టుల భర్తీ జరగట్లేదు.2వేల డ్రైవర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.డ్రైవర్ల కొరతను అధిగమించేందుకు ప్రతి డిపో పరిధిలో ఆన్‌కాల్‌ డ్రైవర్లను అందుబాటులో ఉంచుకున్నారు.ఇందుకు వారికి రోజుకు రూ.800 చెల్లిస్తున్నారు.ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఒక్కో బస్సుకు సగటున 2.6 మంది డ్రైవర్లు అవసరం కాగా.కనీసం ఇద్దరైనా ఉండాలి.అంటే దాదాపు 2వేల మంది ప్రైవేటు డ్రైవర్లు రానున్నారు.దీనివల్ల ఆర్టీసీలో 2వేల డ్రైవర్ల పోస్టుల భర్తీ ఉండదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube