Paytm ఈమధ్య UPI LITE అనే కొత్త ఫీచర్ ఒకదానిని పరిచయం చేసిన సంగతి తెలిసినదే.UPI LITEని వినియోగించడం ద్వారా కస్టమర్‌లు PINని ఉపయోగించకుండానే ఇపుడు UPI లావాదేవీలు చేయవచ్చు.
ఈ ఫీచర్ భారతదేశంలోని ప్రజలకు డిజిటల్ చెల్లింపులను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా దూసుకుపోతోంది.అత్యధిక లావాదేవీల సమయంలో కూడా UPI LITE చెల్లింపులు ఎప్పటికీ విఫలం కావు అని Paytm బల్ల గుద్ది మరీ చెబుతోంది.9 బ్యాంకులు ప్రస్తుతం Paytm UPI లైట్‌కి మద్దతుని ఇస్తున్నాయని మీకు తెలుసా?.

అవును, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, SBI, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లతో సహా Paytm UPI లైట్‌ని యాక్టివేట్ చేయడం కోసం వినియోగదారులకు Paytm రూ.100 విలువగల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.Paytm తన అప్లికేషన్‌లో కొత్త Cancel Protect ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది.
విమాన, బస్సు టిక్కెట్ల కోసం ఈ పథకంతో కంపెనీ 100 శాతం రీఫండ్‌ను అందిస్తుంది.

ఇకపోతే Paytm ద్వారా బుక్ చేసుకున్న విమానాల టికెట్స్ అవసరమైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు.ఇక క్యాన్సిల్ చేసినపుడు ప్రొటెక్ట్ కోసం రూ.149, బస్ టిక్కెట్‌లకు అయితే రూ.25 ఛార్జీతో కూడిన ఛార్జ్ ఉంటుంది.అంటే టికెట్ల క్యాన్సిల్ ప్రొటెక్ట్ కోసం కస్టమర్‌నుండి విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.149, బస్ టిక్కెట్లకు రూ.25 వసూలు చేస్తుందన్నమాట.తద్వారా షెడ్యూల్ సమయానికి కనీసం 24 గంటల ముందు షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి కనీసం 4 గంటల ముందు క్యాన్సిల్ చేసిన బస్ టికెట్లపై ‘క్యాన్సిల్ ప్రొటెక్ట్’తో 100 శాతం వాపసు క్లెయిమ్ చేయవచ్చు కూడా.