సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు స్పీడ్ గా సాగుతున్నాయి.రెండు షెడ్యూల్స్ ను ముగించిన దర్శకుడు త్రివిక్రమ్ తదుపరి షెడ్యూల్ ను వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ లోపు మహేష్ బాబు విదేశాలకు వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి మహేష్ బాబు ఫారిన్ ట్రిప్ కు రెడీ అవుతున్న నేపథ్యం లో అభిమానులు అంతా కూడా మళ్లీ ఎప్పుడు త్రివిక్రమ్ షూట్ లో జాయిన్ అవుతాడా అంటూ వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో విడుదల తేదీ విషయంలో మార్పు వచ్చింది.ఏప్రిల్ నెలలో సినిమా ను విడుదల చేయాల్సి ఉండగా ఆగస్టు నెలలో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా క్లారిటీ వచ్చింది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ మూవీ ని ఆగస్టు లో విడుదల చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.మహేష్ బాబు ను గతంలో అతడు మరియు ఖలేజా సినిమా ల్లో మహేష్ బాబు చూపించిన విషయం తెల్సిందే.
మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరి కాంబో లో మూవీ రాబోతుంది.ప్రస్తుతానికి సినిమా ను ఆగస్టు లోనే విడుదల చేస్తామంటూ నిర్మాత నాగ వంశీ అన్నాడు.అయితే షూటింగ్ ఆలస్యం అయితే విడుదల వాయిదా వేయక తప్పక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబో మూవీ విషయంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ వెయిట్ చేస్తున్న అభిమానులకు తప్పకుండా అలరిస్తుంది.ఈ సినిమా లో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే మరియు శ్రీ లీలాలు నటిస్తున్నారు.
భూమి పడ్నేకర్ కీలక పాత్రలో కనిపించబోతుందట.