జనసేన లో కోటరీ నాయకులుగా ఎప్పుడూ పవన్ తో అంతర్గత చర్చల్లో పాల్గొంటున్న కొంతమంది కి ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.జనసేన రాజకీయంగా బలోపేతం చేయాలంటే కొంత అనుభవం ఉండి మేధావి వర్గంగా ఉన్న కొంతమంది వ్యక్తులను పార్టీలోకి తీసుకువచ్చి పార్టీని మరింత ముందుకు తీసుకురావాలని జనసేనాని ఆరాటపడుతున్నాడు.
ఇదే ఇప్పుడు పవన్ కోటరీని భయపెడుతోంది.కొత్త నాయకులు వస్తే తమ ప్రాభల్యం ఎక్కడ దెబ్బతింటుందో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
కొంతమంది మేధావి వర్గాస్మ్ వారు జనసేనలోకి వచ్చేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నా వారిని ఆ కోటరీ అడ్డుకుంటుందనే గుసగుసలు కూడా లేకపోలేదు.
కానీ పవన్ ఇప్పుడు పార్టీ పటిష్ఠతమై ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుండడంతో పాటు ముఖ్యమైన నాయకులు, మేధావుల పేర్లతో కూడిన జాబితా సిద్ధం చేసుకున్నారు.
ఈ జాబితాలో మేధావుల పరంగా ప్రొఫెసర్ జైహింద్‌రెడ్డి, విద్యావంతుల వేదిక నాయకుడు శ్రీనివాసరావు, ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు విక్రమ్ పూలా, లోక్‌సత్తా నేత కఠారి శ్రీనివాసులు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జంగా గౌతమ్, దిలీప్ బైరా, తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది.
వీరిలో ప్రొఫెసర్ జైహింద్‌రెడ్డి గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారు.పార్టీ సంస్థాగత నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు.విక్రమ్ పూలా ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవికి రాజకీయ అంశాలపై ఇన్‌ఫుట్స్ అందిస్తుండేవారు.
అలాగే రాజకీయ సలహాదారునిగా వ్యవహరించారు.విద్యావంతుల వేదిక నాయకుడు శ్రీనివాసరావు ప్రజారాజ్యంలో ఎస్సీ నాయకుడు.
ఈయనకు ఎస్సీ, ఎస్టీల సమస్యలపై సమగ్రమైన అవగాహన ఉంది.అలాగే సామాజిక అంశాలపై లోతైన పరిశీలన చేసిన అనుభవం ఉంది.
లోక్‌సత్తాలో జయప్రకాశ్ నారాయణకు కఠారి కుడి భుజంగా ఉంటూ సమాజ మార్పుకోసం తన వంతు ప్రయత్నం చేశారు.అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జంగా గౌతమ్ గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేశారు.
ఈయనది స్వస్థలం తూర్పు గోదావరి.గుంటూరు జిల్లాకు చెందిన బైరా దిలీప్ ప్రస్తుతం జనసేనలో ఉన్నప్పటికీ కీలకమైన బాధ్యతలు అప్పగించలేదు.
ప్రస్తుతం పవన్ చుట్టూ ఉన్న కోటరీకి సామాజిక అంశాలపై పట్టులేదనే వాదన బలంగా వినిపిస్తోంది.పవన్ ఈ విషయాన్ని గుర్తించే కొందరిని దగ్గరికి తీసుకోవాలని తపిస్తున్నారు.
అయితే సబ్జెక్టు ఉన్న వారొస్తే తమమాట చెల్లుబాటు కాదనే భయం జనసేనలో రెండోశ్రేణి నాయకత్వాన్ని భయపెడుతోంది.పవన్‌కల్యాణ్ ఎంచుకున్న జాబితాలో కఠారి శ్రీనివాస్ వైసీపీ మద్దతుదారుడని, విక్రమ్ పూలా టీడీపీ అభిమాని అని ఇలా ప్రతినాయకుడిపై ఏదో ఒక వంకచూపి వారిని దగ్గరికి రానివ్వద్దనే ఎత్తుగడలో వారున్నారని సమాచారం.